10
July, 2026

A News 365Times Venture

10
Friday
July, 2026

A News 365Times Venture

AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు

Date:

AP High Court: విశాఖపట్నంలోని రుషికొండ భవనాల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. భవనాల వినియోగంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతం భవనాల వినియోగానికి సంబంధించి కేవలం ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాల వినియోగాన్ని ప్రశ్నిస్తూ విశాఖకు చెందిన జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ప్రక్రియపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను చీఫ్ జస్టిస్ ధర్మాసనం తిరస్కరించింది. తదుపరి విచారణలో కేసుకు సంబంధించిన అంశాలపై కోర్టు పరిశీలన కొనసాగనుంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో రుషికొండ భవనాలను నిర్మించగా.. విపక్షాలు పెద్దస్థాయిలో విమర్శలు గుప్పించాయి.. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ భవనాల వినియోగంపై నిర్ణయం ఇంకా తీసుకోని విషయం విదితమే..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈലിനായുള്ള ഈ കരാറിലെ ഒരു വ്യവസ്ഥ പോലും നടപ്പാക്കില്ല, നിങ്ങള്‍ക്കത് തടയാനാകില്ല; ലെബനനോട് ഹിസ്ബുല്ല

  ബെയ്‌റൂട്ട്: ലെബനനും ഇസ്രഈലും തമ്മില്‍ അടുത്തിടെ ഒപ്പുവെച്ച കരാറിനെ പരസ്യമായി...

“திருமாவளவன்: பாலுக்கும் காவல் – பூனைக்கும் காவல் என்கிறார்" – நயினார் நாகேந்திரன்

பா.ஜ.க தலைவர் நயினார் நாகேந்திரன் திருநெல்வேலியில் செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது, ``கரூரில்...

CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..

CM Chandrababu: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’...

മമതയ്ക്ക് തിരിച്ചടി; മുതിര്‍ന്ന മൂന്ന് തൃണമൂല്‍ എം.പിമാര്‍ ബി.ജെ.പിയില്‍

  കൊല്‍ക്കത്ത: പശ്ചിമ ബംഗാള്‍ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിലെ തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസിന്റെ പരാജയത്തിന്...