9
July, 2026

A News 365Times Venture

9
Thursday
July, 2026

A News 365Times Venture

Sanju Samson: సంజు శాంసన్‌కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ

Date:

Sanju Samson: జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్‌కు చోటు దక్కకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెరదించింది. సంజును జట్టు నుంచి తొలగించలేదని, రాబోయే బిజీ షెడ్యూల్‌తో పాటు ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

జింబాబ్వే సిరీస్‌లో చోటు ఎందుకు దక్కలేదు?

జూలై 6న ప్రకటించిన జింబాబ్వే టీ20 సిరీస్‌కు భారత జట్టులో ప్రభ్‌సిమ్రన్ సింగ్, అభిషేక్ శర్మ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. అయితే సంజు శాంసన్ పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై స్పందించిన బీసీసీఐ వర్గాలు, జింబాబ్వే పర్యటనలో సంజుకు తుది జట్టులో అవకాశం లభించే పరిస్థితి లేకపోవడంతో, అతడిని పర్యటనకు తీసుకెళ్లకుండా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

ఆసియా క్రీడల కోసం సంజు సిద్ధం

బీసీసీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లో సంజు శాంసన్ భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో అతని పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి కల్పించినట్లు పేర్కొన్నారు. “అతను ఆడని సిరీస్‌కు తీసుకెళ్లడం కంటే విశ్రాంతి ఇవ్వడం మంచిదని భావించాం. అతను సీనియర్ ఆటగాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై విమర్శలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇటీవలి ప్రదర్శనపై విమర్శలు

ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐర్లాండ్ పర్యటనలో అతడు డకౌట్ కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కేవలం ఒకే పరుగు చేశాడు. వరుసగా పేలవ ప్రదర్శనల తర్వాత రెండో టీ20లో అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో జింబాబ్వే సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయకపోవడంతో, జట్టు నుంచి పూర్తిగా తొలగించారనే ప్రచారం జరిగింది.

టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన

అయితే, ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు. నాకౌట్ దశలో 97 నాటౌట్, 89, 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా అందుకున్నాడు. అదేవిధంగా, ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు. మొత్తంగా.. జింబాబ్వే పర్యటనకు సంజు శాంసన్ ఎంపిక కాకపోవడం వెనుక కారణం ఫామ్ కాదని, రాబోయే కీలక టోర్నమెంట్లను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇవ్వడమేనని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో సంజు భవిష్యత్‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్టైంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബീഹാറില്‍ മുസ്‌ലിം യുവതിയെ നിര്‍ബന്ധിച്ച് സിന്ദൂരമണിയിച്ചു; ബലമായി നിഖാബ് അഴിപ്പിച്ച് ഹിന്ദുത്വര്‍

നവാഡ: ബീഹാറിലെ നവാഡ ജില്ലയില്‍ വെച്ച് മുസ്‌ലിം യുവതിയെയും അവരുടെ സുഹൃത്തായ...

தமிழக விவசாயிகளுக்கு குட் நியூஸ்; கொப்பரை, தோட்டாபுரி மாம்பழம் கொள்முதல் செய்ய மத்திய அரசு ஒப்புதல்!

தமிழக விவசாயிகளுக்கு நிவாரணம் அளிக்கும் வகையில், கொப்பரை தேங்காய் மற்றும் தோட்டாபுரி...

AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: విశాఖపట్నంలోని రుషికొండ భవనాల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో...

ಕೊಡಗು ಜಿಲ್ಲೆಯ ಜ್ವಲಂತ ಭೂ ಸಮಸ್ಯೆಗಳ ಶಾಶ್ವತ ಪರಿಹಾರಕ್ಕೆ ಸರ್ಕಾರ ತುರ್ತು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಿ- ಸಂಸದ ಯದುವೀರ್

ಮೈಸೂರು,ಜುಲೈ,7,2026 (www.justkannada.in): ಕೊಡಗು ಜಿಲ್ಲೆಯ ಜ್ವಲಂತ ಭೂ ಸಮಸ್ಯೆಗಳ ಶಾಶ್ವತ...