4
July, 2026

A News 365Times Venture

4
Saturday
July, 2026

A News 365Times Venture

Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! “లెక్కలు చెప్పండి.. చర్చకు రండి”

Date:

Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో, మొత్తం ఎంత ఖర్చవుతుందో, తీసుకున్న అప్పులకు ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు. అమరావతిని తొమ్మిది నగరాల రాజధానిగా చెబుతూ ఇప్పుడు ఒక మున్సిపాలిటీ స్థాయికే పరిమితం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2015లో టెండర్లు పిలిచి, 2016లో శంకుస్థాపన చేసిన భవనాలను 2028లో ప్రారంభిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిలో నిర్మించిన భవనాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరెవరు నివసిస్తారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విధంగా ప్రభుత్వ భూములు లేదా కొనుగోలు చేసిన భూముల్లోనే రాజధాని ఏర్పాటు చేసి ఉంటే తక్కువ వ్యయంతో పూర్తయ్యేదని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం వేల కోట్ల రూపాయల అప్పులు చేసి అమరావతి నిర్మాణం చేపడుతున్నారని, భవిష్యత్తులో ఈ భారం రాష్ట్ర ప్రజలపైనే పడుతుందని విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే వాదన వాస్తవానికి విరుద్ధమని అన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్వహణ, వర్షాకాలంలో నీటి పారుదల వంటి అంశాలపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే భారీ అప్పులు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో వాటిని ఎలా తీర్చబోతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలను తెలుసుకునేందుకు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తామని, తమను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా వెనక్కి తగ్గబోమని పేర్ని నాని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ అమరావతికి సంబంధించిన ఆస్తుల వివరాలు, ఖర్చుల లెక్కలు ప్రజలకు వెల్లడించాలని కోరారు. అమరావతి అంశంతో పాటు రాష్ట్రంలోని ఇతర పరిణామాలపైనా పేర్ని నాని స్పందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మత్స్యకారుల డీజిల్ పంపిణీ, పోలీసుల వ్యవహారశైలి, డీఎస్సీ, లాకప్ డెత్ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం లెక్కలతో సమాధానం చెప్పాలని, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధంగా రావాలని పేర్ని నాని సవాల్ విసిరారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

23 വര്‍ഷത്തിന് ശേഷം കോഴിക്കോട് മെഡിക്കല്‍ കോളേജ് യൂണിയന്‍ പിടിച്ചടക്കി എസ്.എഫ്.ഐ

കോഴിക്കോട്: 23 വര്‍ഷത്തിന് ശേഷം കോഴിക്കോട് മെഡിക്കല്‍ കോളേജ് യൂണിയനില്‍ എസ്.എഫ്.ഐക്ക്...

'தவெகவின் குதிரை பேரத்தை பார்த்து ஆளுநர் அமைதியாக இருப்பது ஏன்?'- அதிமுக எம்.பி இன்பதுரை

சென்னை கிண்டியில் உள்ள லோக் பவனில் ஆளுநர் அர்லேகரை அதிமுக கொறடா...

Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు....

ಬಿಎಲ್ ಒಗಳು ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಅರ್ಜಿ ವಿತರಣೆ  ಮಾಡಿ- ರಾಜ್ಯ ಮುಖ್ಯ ಚುನಾವಣಾ ಆಯುಕ್ತರ ಖಡಕ್ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,3,2026 (www.justkannada.in): ಮನೆ ಮನೆಗೆ ಬಿಎಲ್ ಒಗಳು ಭೇಟಿ ನೀಡದೇ...