22
June, 2026

A News 365Times Venture

22
Monday
June, 2026

A News 365Times Venture

Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!

Date:

Hanamkonda: హన్మకొండ జిల్లాలో పోలీస్ వ్యవస్థ పరువు తీసేలా ఓ కామ పిశాచి ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఓ అభాగ్యురాలిపై కన్నేసిన ఓ ఎస్ఐ.. ఆమెపై నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఘోర ఘటన వరంగల్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ తన వ్యక్తిగత సమస్యలతో హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తరుణంలో అక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న గోదారి రాజ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. భర్తతో విడిపోయేందుకు చట్టపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానంటూ ఆ ఎస్సై ఆమెకు నమ్మబలికాడు. ఆ మాయమాటలతో సదరు మహిళను లొంగదీసుకున్నాడు. అనంతరం ఆమె బలహీనతను ఆసరాగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. గత నాలుగేళ్లుగా ఎల్కతుర్తి, హనుమకొండ పరిధిలో ఆ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ నరకయాతన భరించలేకపోయిన బాధితురాలు చివరకు ధైర్యం చేసి నేరుగా రాష్ట్ర డీజీపీ (DGP) కి ఫిర్యాదు చేసింది. న్యాయం కాపాడాల్సిన అధికారి తనను ఎలా మోసం చేశాడో ఉన్నతాధికారులకు వివరించింది. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన పోలీస్ కమిషనర్ (CP) ఆదేశాల మేరకు.. ప్రస్తుతం సీసీఎస్ (CCS) లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించడమే కాకుండా, బాధ్యతయుతమైన పదవిలో ఉండి మహిళను వేధించిన సదరు ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

மோடி – ட்ரம்ப் என்ன பேசினார்கள்? – சசி தரூர் Vs காங்கிரஸ் வெடித்த பிரச்னை

நாடாளுமன்ற உறுப்பினர் சசி தரூர். இவர் காங்கிரஸ்காரர் தான். ஆனால், அவ்வப்போது...

Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్

భారత్ ‘ఎ’ చేతుల్లో ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం...

ഹിസ്ബുല്ലയെ നേരിടാന്‍ ഇസ്രഈലിന് കഴിയുന്നില്ലെങ്കില്‍ ആ ചുമതല സിറിയയെ ഏല്‍പ്പിക്കണം: വീണ്ടും നിലപാട് വ്യക്തമാക്കി ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ലെബനനിലെ ഹിസ്ബുല്ലയെ തുരത്തുന്ന കാര്യത്തില്‍ ഇസ്രഈലിന്റെ പ്രകടനത്തില്‍ കടുത്ത അതൃപ്തി...