25
June, 2026

A News 365Times Venture

25
Thursday
June, 2026

A News 365Times Venture

Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్‌వాడీ కేంద్రంలో కలకలం

Date:

Anganwadi: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అంగన్వాడీ ఆహారంలో చనిపోయిన పాము కనిపించింది. అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీలకు అందించే పోషకాహార లడ్డూ ప్యాకెట్‌లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం స్థానికంగా కలకలం కలిగించింది. ఈ ఘటన పాండుర జిల్లాలోని కర్ఘాట్ కమ్థి గ్రామంలో చోటుచేసుకుంది. వచలా బాయి ధుర్వే అనే గర్భిణీ స్త్రీకి అంగన్వాడీ కేంద్రం నుంచి పోషకాహార ప్యాకెట్ అందించారు.

ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కుటుంబీకులు ఆ ప్యాకెట్‌ను తెరిచి చూడగా అందులో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, ఈ ఆహారాన్ని ఎవరూ తినకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆందోలన వ్యక్తి చేశారు. గర్భిణీలు, చిన్నపిల్లలకు సరఫరా చేసే ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఫుడ్ శాంపిళ్లను పరీక్ష కోసం పంపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വിവാഹസല്‍ക്കാരത്തിന് ബീഫ് വിളമ്പിയെന്നാരോപണം; ഉത്തര്‍പ്രദേശില്‍ ഹാള്‍ പൊളിച്ചുമാറ്റി അധികൃതര്‍

മുസാഫര്‍നഗര്‍: ഉത്തര്‍പ്രദേശിലെ ഷാംലി ജില്ലയില്‍ വിവാഹ സല്‍ക്കാരത്തില്‍ ബീഫ് വിളമ്പിയെന്നാരോപിച്ച് ബാങ്ക്വേറ്റ്...

Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!

Water Bottle Cleaning: మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను...

ದೇವನಹಳ್ಳಿ ಭೂಸ್ವಾಧೀನ: ಎಕರೆಗೆ ₹2.70 ಕೋಟಿ ಪರಿಹಾರಕ್ಕೆ ಶಿಫಾರಸು

ಬೆಂಗಳೂರುಜೂನ್,24,2026 (www.justkannada.in): ದೇವನಹಳ್ಳಿ ತಾಲ್ಲೂಕು ಚನ್ನರಾಯಪಟ್ಟಣ ಹೋಬಳಿಯ ಗೋಕರೆಬಚ್ಚೇನಹಳ್ಳಿ ಮತ್ತು ಹ್ಯಾಡಾಳ...