25
June, 2026

A News 365Times Venture

25
Thursday
June, 2026

A News 365Times Venture

Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!

Date:

న్యూయార్క్ సిటీలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రానికి చెందిన యువకుని దుండగులు కాల్చి చంపారు. బతుకు తెరువు కోసం అమెరికాకు వెళ్లిన యువకుడు అక్కడ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో పిజ్జా డెలివరీ ఇచ్చేందుకు వెళుతుండగా దుండగులు కాల్చి చంపేశారు. మేడ్చల్‌కి చెందిన కుంచా అన్షుల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న అన్షుల్‌ను గన్‌తో కాల్చి చంపేశారు దుండగులు. శుక్రవారం ( జూన్ 5 ) రాత్రి 12 గంటల సమయంలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గన్‌తో ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. అన్షుల్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి వాసి అని సమాచారం.

నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియాలోని ఒక ఖాళీ ఇంటికి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన కుంచ అన్షుల్‌ను దుండగులు కాల్చి చంపినట్లు తెలిపారు అక్కడి పోలీసులు. ఈ ఘటన ఎడ్జ్‌లీ స్ట్రీట్‌లోని 2300 బ్లాక్‌లో తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో జరిగిందని తెలిపారు. తలకి బుల్లెట్ గాయంతో అన్షుల్ కుప్పకూలినట్లు తెలిపారు పోలీసులు. అన్షుల్‌ను టెంపుల్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు నిర్దారించారని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

మృతుడు అత్యంత సన్నిహితుడు కిరణ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘న్యూయార్క్ లో అన్షుల్‌ను దుండగులు తలపై కాల్పులు జరిపి హత్య చేశారు. మాకు 5వ తేదీన సమాచారం వచ్చింది. ఎమ్మెస్ పూర్తి చేసుకున్న అన్షు.. అమెరికా ఫిలతలపియలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం పనిచేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో హైదరాబాద్ వచ్చేవాడు. కానీ ఇంతలోనే దారుణ హత్యకు గురవడం బాదం కలిగిస్తుంది. రాత్రి 12 గంటలకు పిజ్జా డెలివరి చేస్తుండగా గన్నుతో ఫైర్ చేసి చంపార్ దుండగులు. గతంలో ఓసారి అమెరికాలో నల్లజాతీయులు అన్షుపై అటాక్ చేసి మొబైల్ ఫోన్, డబ్బులు దొంగతనం చేశారు. ఇప్పుడు ఏకంగా అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీలైనంత త్వరలో అన్షు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చస్తున్నా. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చాలామంది చనిపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంను సిరియస్‌గా తీసుకొని అమెరికా రాయబారితో మాట్లాడి భద్రత కల్పించాలి’ అని కోరాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വിവാഹസല്‍ക്കാരത്തിന് ബീഫ് വിളമ്പിയെന്നാരോപണം; ഉത്തര്‍പ്രദേശില്‍ ഹാള്‍ പൊളിച്ചുമാറ്റി അധികൃതര്‍

മുസാഫര്‍നഗര്‍: ഉത്തര്‍പ്രദേശിലെ ഷാംലി ജില്ലയില്‍ വിവാഹ സല്‍ക്കാരത്തില്‍ ബീഫ് വിളമ്പിയെന്നാരോപിച്ച് ബാങ്ക്വേറ്റ്...

Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!

Water Bottle Cleaning: మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను...

ದೇವನಹಳ್ಳಿ ಭೂಸ್ವಾಧೀನ: ಎಕರೆಗೆ ₹2.70 ಕೋಟಿ ಪರಿಹಾರಕ್ಕೆ ಶಿಫಾರಸು

ಬೆಂಗಳೂರುಜೂನ್,24,2026 (www.justkannada.in): ದೇವನಹಳ್ಳಿ ತಾಲ್ಲೂಕು ಚನ್ನರಾಯಪಟ್ಟಣ ಹೋಬಳಿಯ ಗೋಕರೆಬಚ್ಚೇನಹಳ್ಳಿ ಮತ್ತು ಹ್ಯಾಡಾಳ...