21
May, 2026

A News 365Times Venture

21
Thursday
May, 2026

A News 365Times Venture

Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..

Date:

Dhurandhar-2: ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘‘ధురంధర్ 2’’ వివాదంలో చిక్కుకుంది. సైన్యానికి సంబంధించిన ఆపరేషన్ల వివరాలను బయటపెట్టిందని సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి)లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దీపక్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)లో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఇలాంటి వివరాలు సినిమాలో ఉన్నాయనే ఆరోపణలను పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.

Read Also: Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కానిస్టేబుల్ దాఖలు చేసిన పిల్‌లో.. మిలిటరీ ఆపరేషన్స్ వివరాలను ధురంధర్ బహిర్గతం చేసిందని, ఇది దేశ భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించవచ్చని ఆరోపించారు. అయితే, ఈ సినిమా కల్పితం కావచ్చని, కానీ భద్రతాదళ సిబ్బంది లేవనెత్తిన ఆందోళనల్ని విస్మరించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ధురందర్: ది రివెంజ్’ చిత్రం అధికార రహస్యాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ జరపాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం, ఈ విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను, సీబీఎఫ్‌సీని కోరింది. సినిమాలోని కొన్ని సంఘటనలు, ఉన్నత స్థాయి అధికారులు, మరణించిన సైనికుల్ని పోలిన పాత్రలను చాలా స్పష్టంగా చిత్రీకరించడం వల్ల దేశ భద్రత, సమగ్రత దృష్ట్యా ఇది దేశ ప్రజయోజనాలకు మంచిది కానదే అభిప్రాయాన్ని పిటిషనర్ వ్యక్తపరిచారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഈജിപ്ഷ്യന്‍ സമ്മര്‍ദത്തിന് വഴങ്ങി നിലപാട് മാറ്റി അല്‍-അസ്ഹര്‍; ഇറാനുമായുള്ള സംഘര്‍ഷത്തില്‍ യു.എ.ഇക്ക് പരസ്യ പിന്തുണ

  അബുദാബി: ഇറാനുമായുള്ള വര്‍ധിച്ചുവരുന്ന സംഘര്‍ഷങ്ങളില്‍ യു.എ.ഇയ്ക്കും മറ്റ് ഗള്‍ഫ് രാജ്യങ്ങള്‍ക്കും...

கும்பகோணம்: `பிரசாரத்தில் ஹோலோகிராம் விஜய்; மக்கள் இயக்க பணி டு அமைச்சர்!' – யார் இந்த வினோத்?

கும்பகோணம் சட்டமன்றத் தொகுதி தொடர்ந்து 30 வருடங்களாக திமுக வசம் இருந்தது....

RTI ಕಾರ್ಯಕರ್ತ ಗಂಗರಾಜು ವಿರುದ್ಧ FIR ದಾಖಲು

ಮೈಸೂರು,ಮೇ,21,2026 (www.justkannada.in): ನಗರದ ಕುವೆಂಪುನಗರ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ನಡೆದಿದ್ದ...