17
May, 2026

A News 365Times Venture

17
Sunday
May, 2026

A News 365Times Venture

PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు

Date:

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం యూఏఈలో కొనసాగగా.. శనివారం నెదర్లాండ్స్‌లో కొనసాగుతోంది. ముందుగా భారతీయ సమాజాన్ని కలిసి కీలక ప్రసంగం చేశారు. అనంతరం నెదర్లాండ్స్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమై కీలక చర్చలు జరిపారు.

Dke

ఇక పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాను రాజభవనంలో కలిశారు. ఈ సందర్భంగా భారత్-నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగినట్లు మోడీ వెల్లడించారు.

ఈ భేటీ అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘రాయల్ ప్యాలెస్‌లో రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను కలిశాను. సాంకేతికత, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, వాణిజ్యం, జల వనరులు వంటి కీలక రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ స్నేహాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా అనిపించింది.’’ అని పేర్కొన్నారు.

అలాగే భారత్, నెదర్లాండ్స్ దేశాలు పరస్పర ప్రయోజనాలతో పాటు భవిష్యత్ తరాలకు అనుకూలమైన ప్రపంచ నిర్మాణం అనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని మోడీ తెలిపారు. ఇక మోడీ సమక్షంలో టాటా ఎలక్ట్రానిక్స్, ASML ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മൂന്നാമത് കുട്ടിക്ക് 30,000, നാലാമന് 40,000; ജനസംഖ്യ കൂട്ടാൻ ‘ബമ്പർ പ്രഖ്യാപനവുമായി’ ചന്ദ്രബാബു നായിഡു

  അമരാവതി: ആന്ധ്രാപ്രദേശിൽ ജനസംഖ്യാ വർധനവ് ലക്ഷ്യമിട്ട് നിർണായക സാമ്പത്തിക പ്രോത്സാഹന...

வித்யாஷ்ரம் பள்ளியில் நிர்வாக பிரச்னை; இடைக்கால நிர்வாகியாக விஜய்குமார் ரெட்டி – நீதிமன்றம் தீர்ப்பு

செட்டிநாடு வித்யாஷ்ரம் பள்ளியை நடத்தி வரும் குமார ராஜா முத்தையா பாரம்பரிய...

ನುಡಿದಂತೆ ನಡೆದಿರುವುದಕ್ಕೆ ಸಾಧನಾ ಸಮಾವೇಶ- ಸಚಿವ ಡಾ. ಶರಣಪ್ರಕಾಶ ಪಾಟೀಲ್‌

ಬೆಂಗಳೂರು, ಮೇ, 16,2026 (www.justkannada.in):  ಕಾಂಗ್ರೆಸ್‌ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ...

യുവാക്കൾ പാറ്റകളെന്ന പരാമർശം: മാധ്യമങ്ങൾ വാക്കുകൾ തെറ്റായി വ്യാഖ്യാനിച്ചു, വേദനയുണ്ടെന്ന് ചീഫ് ജസ്റ്റിസ് സൂര്യകാന്ത്

ന്യൂദൽഹി: തൊഴിൽരഹിതരായ യുവാക്കൾ പാറ്റകളെ പോലെയെന്ന തന്റെ പരാമർശത്തിൽ വിശദീകരണവുമായി സുപ്രീം...