16
May, 2026

A News 365Times Venture

16
Saturday
May, 2026

A News 365Times Venture

Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Date:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలను, వారి త్యాగాలను అధికారికంగా గుర్తించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను పరిష్కరిస్తూ, ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం , సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఆర్టీ నం.679 జారీ చేసింది. తెలంగాణ కోసం కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు లాఠీ దెబ్బలకు శారీరక వైకల్యానికి గురయ్యారు. వేలాది మందిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో, వారిని ప్రభుత్వం తరపున గౌరవించాల్సిన బాధ్యత ఉందని భావించి ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

ఈ ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ , విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అసలైన ఉద్యమకారులను గుర్తించేందుకు తొలుత స్పష్టమైన , శాస్త్రీయమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఆ ప్రమాణాల ఆధారంగా సమగ్రమైన ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేసి, అనంతరం వారికి ప్రభుత్వం తరపున ఎలాంటి గుర్తింపు, గౌరవ పురస్కారాలు , సంక్షేమ సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేస్తుంది.

విధివిధానాల రూపకల్పనలో భాగంగా కమిటీకి విస్తృత అధికారాలను ప్రభుత్వం కల్పించింది. అవసరమైతే సంబంధిత శాఖల అధికారులను పిలిపించుకోవడానికి, సమాచారాన్ని సేకరించడానికి , వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడానికి కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు ఈ కమిటీకి అవసరమైన పూర్తి సహకారం , సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యమకారులకు సగౌరవమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ലീഗാണ് ഹൈക്കമാന്‍ഡെന്ന് വിദ്വേഷം പടര്‍ത്തിയ പരിവാര രാഷ്ട്രീയക്കാരെ, പട്ടികജാതിക്കാരനായ മന്ത്രിയില്ലാത്തതില്‍ വാദിക്കാന്‍ കണ്ടതേയില്ല: ശ്യാംകുമാര്‍

കോഴിക്കോട്: കഴിഞ്ഞ കാലങ്ങളില്‍ മന്ത്രിസഭകളില്‍ പട്ടികജാതി വിഭാഗത്തില്‍ നിന്നും മന്ത്രി ഇല്ലാതിരിക്കുന്നിട്ടും...

"எல்லா விஷயங்களிலும் ஒன்றாக நிற்க முடியாது" – பினராயி விஜயனைச் சந்தித்த வி.டி.சதீசன் கூறியது என்ன?

கேரள மாநிலத்தில் நடந்து முடிந்த சட்டசபை தேர்தலில் பெரும்பான்மை பெற்று ஆட்சி...

‘ಕ್ಯಾಂಪಸ್ ಟು ಕೆರಿಯರ್’ ಯುವಜನರನ್ನ ನಾಳೆಯ ಅವಕಾಶಗಳಿಗೂ ಸಿದ್ಧಪಡಿಸುವ ಕಾರ್ಯಕ್ರಮ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮೇ,15,2026 (www.justkannada.in): ಕ್ಯಾಂಪಸ್ ಟು ಕೆರಿಯರ್ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಯುವಜನರನ್ನು...