22
April, 2026

A News 365Times Venture

22
Wednesday
April, 2026

A News 365Times Venture

BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…

Date:

BJP: ప్రధాని నరేంద్రమోడీని ‘‘ఉగ్రవాది’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు అన్నామలై, సంబిత్ పాత్ర వంటి వారు కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అన్నామలై మాట్లాడుతూ.. ఖర్గే ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆయన ప్రధాని పదవి గౌరవాన్ని దిగజార్చారని, ఖర్గే బహిరంగ క్షమాపణలు చెప్పి, ప్రజల్ని క్షమాభిక్ష కోరాలని డిమాండ్ చేశారు.

Read Also: Abhishek Sharma: 25 ఏళ్లకే దిగ్గజాలను అధిగమించిన అభిషేక్ శర్మ.. రోహిత్ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ హిస్టరీ రీ-రైట్!

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిరాశ, నిస్పృహ, మానసిక దివాళాను సూచిస్తున్నాయని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలు 145 కోట్ల మంది ప్రజల్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా పన్నిన కుట్ర అని, రాహుల్ గాంధీ ప్రతీరోజూ తన ప్రసంగాలలో ప్రధానిపై అవమానకరమైన భాష ఉపయోగిస్తున్నారని, రాహుల్ ఆదేశాల మేరకు ఖర్గే ప్రధానిని ఉగ్రవాదిగా పిలిచారని ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్ వంటిని వారిని ‘‘ఒసామా జీ’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

மேற்கு வங்கம் : பிரசார களத்துக்கு வந்த 'மீன்கள்' ; மேற்கு வங்கத்தை அசைக்கும் உணவு யுத்தம்!

கொல்கத்தாவின் பாரக்பூர் தொகுதியின் பா.ஜ.க வேட்பாளரான கௌஸ்தவ் பக்சி, பாரம்பரிய உடை...

TGSRTC: ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి..

TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే...

ದಿ ಆಕ್ಮಿ ಸ್ಕೂಲ್ ವೆಬ್‌ ಸೈಟ್ ಬಿಡುಗಡೆ

ಮೈಸೂರು, ಏಪ್ರಿಲ್, 21, 2026 (www.justkannada.in): ಶೈಕ್ಷಣಿಕ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನವೀನತೆ...