22
April, 2026

A News 365Times Venture

22
Wednesday
April, 2026

A News 365Times Venture

OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం

Date:

OTR: NDSA ఛైర్మన్‌ విషయంలో ఏదో తేడా కొడుతోందా? ఆయన మీద కమలం నేతలకు కోపం ఎందుకొచ్చింది? ఏకంగా ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసే దాకా ఎందుకు వెళ్ళింది వ్యవహారం? ఈ విషయంలో నేరుగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎందుకు ఇన్వాల్వ్‌ అయ్యారు? అసలేంటి ఆ డ్యామ్‌ గేమ్‌? నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌పై కమలం పార్టీ కస్సుబుస్సులాడుతోందట. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం పర్యటన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో NDSA ఛైర్మన్‌ పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కమలదళం.

READ ALSO: BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…

పైగా… అదే టైంలో సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేయడంతో… ఛైర్మన్‌ తీరుపై మండిపడుతున్నారు తెలంగాణ బీజేపీ లీడర్స్‌. ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ వ్యవహారశైలిపై కేంద్ర మంత్రి బండి సంజయ్…. జలశక్తి శాక మంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ దగ్గరుండి వివరాలు చెప్పడం వరకు ఓకే అయినా…. ఒక కేంద్ర ప్రభుత్వ అధికారి ఏకంగా రాజకీయ వ్యాఖ్యలు చేసే ప్రెస్‌మీట్‌లో ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. తన టూర్లో భాగంగా కాళేశ్వరం వెళ్లారు సీఎం. మేడిగడ్డను సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు ఉన్నారు. అదే సమయంలో NDSA ఛైర్మన్‌ అనిల్ జైన్ కూడా వాళ్ళతో ఉన్నారు. సీఎం, మంత్రులతో కలిసి తిరిగారు. పనిలో పనిగా ప్రెస్ మీట్‌లో కూడా కూర్చోవడంపై బీజేపీ వైపు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఆయన వైఖరిపై పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారట కమలం నేతలు. అనిల్‌జైన్‌ ఇప్పటి వరకు తెలంగాణలో ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు? వ్యవహారశైలి ఎలా ఉందంటూ…. సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.

తన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి… కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసు దర్యాప్తు కోసం సీబీఐకి లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని కూడా విమర్శించారాయన. బీజేపీని అడ్డుపెట్టుకుని అవినీతి కేసుల నుంచి బయటపడతామని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరించారాయన. సరిగ్గా ఇక్కడే కాషాయ నేతలకు మండుతోందట. అంటే… మేం అవినీతిపరులకు అండగా నిలబడే వాళ్ళమని అనుకుంటున్నారా అంటూ ఫైరైపోతున్నట్టు సమాచారం. ఇలాంటి సమావేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా అనిల్‌జైన్‌ ఎలా పాల్గొంటారంటూ మండిపడుతున్నారు. ఇక కాళేశ్వరం విషయంలో NDSA మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని, ప్రతి విషయంలో NDSA అప్రూవల్ తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ… ఇందులో కూడా ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు బీజేపీ నాయకులు. అదేంటో త్వరలోనే బయటపడుతుందని కూడా చెబుతున్నారు.

ఆ సంగతి ఎలా ఉన్నా… కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన, నేరుగా పొలిటికల్ కామెంట్స్‌ చేసిన మీటింగ్‌లో NDSA ఛైర్మన్‌ ఎలా కూర్చున్నారంటూ… ఆగ్రహంగా ఉన్నారట. అదే విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌…. జలశక్తి శాఖ మంత్రి దగ్గర ప్రస్తావించినట్టు తెలిసింది. కేవలం మాటతో సరిపెట్టకుండా…. ఫిర్యాదు చేసి… రాష్ట్రంలో జరిగిన వ్యవహారాలన్నిటినీ వివరంగా చెప్పారట. ఇదే సమయంలో అనిల్‌జైన్‌కు సంబంధించిన రకరకాల అంశాలు తెర మీదికి వస్తున్నాయి. ఆయన మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయంటూ వాటిని వివరాలు సేకరిస్తున్నారు బీజేపీ నాయకులు. అసలు ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి టూర్‌కు ఆయన తన మంత్రివర్గ శాఖలో చెప్పి అనుమతి తీసుకుని వచ్చారా? లేక సొంత పెత్తనాలు చేస్తున్నారా అంటూ కూపీ లాగుతున్నారు కమలం లీడర్స్‌.

READ ALSO: Rice Vadiyalu: అన్నం మిగిలిపోతే అస్సలు పడేయకండి.. ఇలా చేస్తే అదిరిపోయే రైస్ పాపడ్స్ రెడీ అవుతాయ్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.എസ് പടക്കപ്പലുകളെ കാഴ്ചക്കാരാക്കി ഇറാനിയന്‍ ടാങ്കര്‍ ‘സില്ലി സിറ്റി’ തീരത്തെത്തി; നാവിക ഉപരോധം മറികടന്ന് ഇറാന്‍ സൈന്യം

ടെഹ്റാന്‍: അമേരിക്കന്‍ നാവികസേനയുടെ ശക്തമായ ഉപരോധവും ആവര്‍ത്തിച്ചുള്ള മുന്നറിയിപ്പുകളും അവഗണിച്ച് ഇറാനിയന്‍...

BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…

BJP: ప్రధాని నరేంద్రమోడీని ‘‘ఉగ్రవాది’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...

ಚಾಮರಾಜನಗರ: 523 ಕೋಟಿ ರೂ. ಮೊತ್ತದ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿಗೆ ಚಾಲನೆ-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಚಾಮರಾಜನಗರ,ಏಪ್ರಿಲ್, 21,2026 (www.justkannada.in): ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಮಹಿಳಾ ಮೀಸಲಾತಿಯನ್ನು  ಸದಾ...