14
April, 2026

A News 365Times Venture

14
Tuesday
April, 2026

A News 365Times Venture

Mouli : మౌళి ‘దొంగనా కొడుకు’ : మైత్రి మూవీస్

Date:

 యూట్యూబ్ మరియు వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న మౌళి #90s తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లీడ్ రోల్ లో చేసిన లిటిల్ హార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో మౌళికి ఆఫర్స్ వెల్లువెత్తాయి. కానీ మౌళి ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మౌళి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దొంగ నా కొడుకు అనే మాస్ అండ్ ఫన్నీ టైటిల్‌ను ఖరారు చేశారు.

Also Read :  NTRNEEL : మరోసారి తారక్‌తో జోడీ కట్టనున్న ఆలియా భట్

సాధారణంగా సినిమాలకు క్లాస్ టైటిల్స్ లేదా గంభీరమైన పేర్లు పెట్టడం చూస్తుంటాం. కానీ ‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్ వినగానే ఇది ఒక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం అని అర్థమవుతోంది. మౌళి శైలికి తగ్గట్టుగా ఈ సినిమా కథాంశం కూడా చాలా వినూత్నంగా సరదాగా సాగిపోనుందని తెలుస్తోంది. ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినిమాపై అప్పుడే హైప్ మొదలైంది. టాలీవుడ్‌లో పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ చిన్న చిత్రాలను కూడా ఎంతో రిచ్‌గా నిర్మిస్తుంటారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വനിതാ സംവരണം 2029ല്‍ ജയിക്കാനുള്ള ബി.ജെ.പി തന്ത്രം, മണ്ഡല പുനര്‍നിര്‍ണയത്തില്‍ ഉത്തരേന്ത്യന്‍ പക്ഷപാതം: കപില്‍ സിബല്‍

ന്യൂദല്‍ഹി: വനിതാ സംവരണ നിയമത്തെ മണ്ഡല പുനര്‍നിര്‍ണയവുമായി ബന്ധിപ്പിക്കുന്നത് 2029ലെ പൊതുതെരഞ്ഞെടുപ്പില്‍...

பணி மாறுதலுக்கு பணம் வாங்கும் முறை ஒழிக்கப்படும்; திருப்பூரில் விஜய் அறிவித்த வாக்குறுதிகள் என்ன?

தவெக தலைவர் விஜய் இன்று திருப்பூரில் பிரசாரம் மேற்கொண்டிருந்தார். அப்போது மக்கள்...

CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్....

ದೇಶಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಹಾಗೂ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಹೋರಾಟದ ಫಲ-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು, ಏಪ್ರಿಲ್ 14,2026 (www.justkannada.in): ದೇಶಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ...