31
May, 2026

A News 365Times Venture

31
Sunday
May, 2026

A News 365Times Venture

డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!

Date:

ICC Women’s T20 World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ ప్రారంభానికి ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలుబడింది.

Lenovo: లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ లెకూ బెల్లేటర్ 7000 విడుదల.. ధర తక్కువ, పెర్ఫార్మెన్స్ హై!

ఈసారి టీ20 వరల్డ్ కప్ కోసం మొత్తం ప్రైజ్ మొత్తాన్ని 8,764,615 డాలర్లు (రూ.81 కోట్లు)గా ఐసీసీ వెల్లడించింది. ఇక ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టుకు రూ.21.8 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.10 కోట్లు దక్కనున్నాయి. సెమీస్‌ లో ఓడిపోయిన జట్లకు రూ.6 కోట్ల చొప్పున, అలాగే గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు రూ.29 లక్షలు లభించనున్నాయి. అలాగే టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస చెల్లింపుగా రూ.2.3 కోట్లు ఇచ్చేలా ఐసీసీ నిర్ణయించింది. 2024 ఎడిషన్‌లో 7,958,077 డాలర్లు నగదు బహుమతి (రూ.70 కోట్లకు పైగా) ఉండగా.. ఈ సారి ఆ మొత్తాన్ని 10% వరకు పెంచింది ఐసీసీ.

ఈ విషయాన్నీ తెలుపుతూ ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడారు. మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, టోర్నీని 12 జట్లకు విస్తరించడం.. రికార్డు స్థాయి ప్రైజ్ మనీ ప్రకటించడం ద్వారా ప్రపంచ స్థాయిలో మరింత పోటీ వాతావరణాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మహిళా క్రీడాకారుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని, ఈ టోర్నీ కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు DP వరల్డ్‌తో కలిసి ఐసీసీ ట్రోఫీ టూర్ కూడా ప్రారంభమైంది. ఈ టూర్ లండన్‌లో ప్రారంభమై, ఫైనల్ మ్యాచ్ జరిగే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ట్రోఫీని ప్రదర్శించారు.

IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..

ఆ తర్వాత నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి యూరప్ దేశాల్లో పర్యటించి, మే నెలలో ఇంగ్లాండ్‌ లోని పలు హోస్ట్ నగరాల్లో అభిమానులను అలరించనుంది. లీడ్స్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్, లండన్ నగరాల్లో కీలక ప్రదేశాల్లో ట్రోఫీ ప్రదర్శనతో పాటు అభిమానులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 12న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, శ్రీలంకతో బర్మింగ్‌హామ్‌ లోని ఎడ్జ్‌ బాస్టన్ మైదానంలో తొలి మ్యాచ్ ఆడనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നീറ്റിനും സി.ബി.എസ്.ഇക്കും പിന്നാലെ ബിരുദ പ്രവേശന പരീക്ഷയും താളം തെറ്റി, നോക്കുകുത്തിയായി എന്‍.ടി.എ

ന്യൂദല്‍ഹി: നീറ്റ് യു.ജി പരീക്ഷാ ക്രമക്കേടുകള്‍ക്ക് പിന്നാലെ, രാജ്യത്തെ കേന്ദ്ര സര്‍വകലാശാലകളിലേക്കുള്ള...

Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్

Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 14 రోజుల...

ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕಾಂಗ ಪಕ್ಷದ ಸಭೆಗೆ ಕ್ಷಣಗಣನೆ: ಹೈಕಮಾಂಡ್ ನಾಯಕರು, ಶಾಸಕರು ಆಗಮನ

ಬೆಂಗಳೂರು,ಮೇ,30,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ದಿಢೀರ್ ರಾಜಕೀಯ ಬೆಳವಣಿಗೆಯಾಗಿ ಸಿಎಂ ಸ್ಥಾನಕ್ಕೆ...