23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

Hezbollah Chief: ఇరాన్‌కి కోలుకోలేని షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ క్లోజ్!

Date:

Hezbollah Chief: ఇజ్రాయెల్‌ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్‌ నయీం ఖాసీమ్‌ మృతి చెందారు. తమ దాడుల్లో నయీం ఖాసీమ్‌ మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే హిజ్బుల్లా అధిపతి నయీమ్ ఖాసీమ్ కార్యదర్శి, మేనల్లుడు అయిన అలీ యూసుఫ్ హర్షీని కూడా హతమార్చినట్లు పేర్కొంటూ ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకటన విడుదల చేశాయి. IDF దళాలు లెబనీస్ రాజధాని బీరుట్‌లో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు.

READ ALSO: Yuvraj Singh: ‘6 నెలలు మాత్రమే బతుకుతామన్నారు’.. క్యాన్సర్ పరిస్థితులపై యూవరాజ్ సింగ్ భావోద్వేగం..

లెబనాన్‌లోని హిజ్బుల్లా మౌలిక సదుపాయాలు, ఆయుధ డిపోలపై బుధవారం రాత్రి వరుస దాడులు నిర్వహించినట్లు IDF పేర్కొంది. ఈ ఆపరేషన్ల ముఖ్య ఉద్దేశ్యం, ఆ ఉగ్రవాద సంస్థ యొక్క కమాండ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా దెబ్బతీయడం, దాని ఆయుధ సరఫరా మార్గాలను పూర్తిగా నిలిపివేయడం అని పేర్కొంది. బుధవారం రాత్రి బీరూట్‌లోని ఒక ప్రాంతంలో ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) వైమానిక దాడి జరిపినట్లు ఆ సంస్థ ప్రకటించింది . ఈ దాడిలో హిజ్బుల్లా అధిపతి, ఆయన కార్యదర్శి అలీ యూసఫ్ హెర్షి మరణించారు. IDF ప్రకారం.. ఈ ఇద్దరు అగ్ర నాయకుల మరణం హిజ్బుల్లా నాయకత్వ వ్యవస్థకు గణనీయమైన దెబ్బగా అభిప్రాయపడ్డారు. ఈ దాడి బీరూట్‌లోని ఆ బృందం యొక్క కీలక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్న ప్రాంతంలో జరిగింది.

రాత్రి సమయంలో లిటాని నది మీదుగా ఉత్తరం నుంచి దక్షిణానికి రాకపోకల కోసం ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్‌లను కూడా ఐడిఎఫ్ ధ్వంసం చేసింది. ఈ మార్గాలను హిజ్బుల్లా కమాండర్లను, వేలాది ఆయుధాలను, రాకెట్లను, లాంచర్లను తరలించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ చర్య హిజ్బుల్లా పోరాట సామర్థ్యం, లాజిస్టిక్స్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని సమాచారం. దక్షిణ లెబనాన్‌లోని సుమారు 10 హిజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ పేర్కొంది . రాకెట్ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. హిజ్బుల్లా మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమయ్యే వరకు ఉగ్రవాదంపై తమ పోరాటం కొనసాగుతుందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.

READ ALSO: Pakistan: ఇరాన్‌కు పాక్ వెన్నుపోటు? అమెరికా చేతిలో ‘కీలుబొమ్మ’గా మారిన ఇస్లామాబాద్.. తెరపైకి సంచలన నిజాలు!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇറാനെ നരകത്തിലേക്ക് തള്ളിവിടണോ, അതോ കരാറില്‍ ഏര്‍പ്പെടണോ; യു.എന്‍ പൊതുസഭയില്‍ കടുത്ത മുന്നറിയിപ്പുമായി ട്രംപ്

ന്യൂയോര്‍ക്ക്: ഇറാനുമായി കരാറിലെത്തണോ അതോ രാജ്യത്തെ പൂര്‍ണമായി തകര്‍ക്കണോ എന്നത് സംബന്ധിച്ച്...

தாராபுரம்: திமுக நிர்வாகிகள் வீட்டில் ரூ.48 லட்சம் பறிமுதல்| தீவிர விசாரணையில் தேர்தல் பறக்கும் படை!

திருப்பூர் மாவட்டம் தாராபுரம் (தனி) தொகுதியில் அக்டோபர்- 6- ம் தேதி...

Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు

Telangana 22A Land List: తెలంగాణలో సంచలనంగా మారింది 22A.. రాష్ట్రంలో...

ദല്‍ഹി എസ്.ഐ.ആര്‍: വോട്ടര്‍മാര്‍ക്ക് നല്‍കിയ നോട്ടീസുകള്‍ യന്ത്രനിര്‍മിതമെന്ന് സുപ്രീം കോടതി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയിലെ വോട്ടര്‍ പട്ടിക പ്രത്യേക തീവ്രപരിഷ്‌കരണവുമായി (എസ്.ഐ.ആര്‍) ബന്ധപ്പെട്ട് വോട്ടര്‍മാര്‍ക്ക്...