28
February, 2026

A News 365Times Venture

28
Saturday
February, 2026

A News 365Times Venture

Modi-Trump: ప్రధాని మోడీతో మాట్లాడిన ట్రంప్.. యూఎస్ రాయబారి ఆసక్తికర పోస్ట్..

Date:

Modi-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఈరోజు(సోమవారం) ఫోన్‌లో మాట్లాడినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ పోస్టులో ‘‘స్టే ట్యూన్డ్’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయితే, ఇరువురు నేతలు ఏ విషయంపై మాట్లాడారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే, భారత్-అమెరికా మధ్య కీలక వాణజ్య ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: Apple Valentines Day Sale 2026: ఆపిల్ వాలెంటైన్స్ డే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌.. మ్యాక్‌బుక్స్, ఐఫోన్‌లపై భారీ తగ్గింపు

ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో అనిశ్చితి ఏర్పడింది. కేంద్ర బడ్జెట్ 2026లో కూడా ఈ టారిఫ్‌లను ఎదుర్కొనే చర్యల్ని పొందుపరిచారు. భారత్ తన ఉత్పత్తుల కోసం ఇతర మార్కెట్లను చూసుకుంటోంది. ఇటీవల యురోపియన్ యూనియన్-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరింది. చివరిసారిగా డిసెంబర్ 2025లో ఇరువురు నేతలు మాట్లాడారు.

తాజాగా ప్రధాని మోడీ కూడా ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈ చర్చ సానుకూలంగా సాగిందని అభివర్ణించారు. మరోవైపు రాయబారి ‘‘స్టే ట్యూన్డ్’’ అని వ్యాఖ్యలో రెండు దేశాల మధ్య కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా రాయబారి పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రధాని మోడీ ఫోటో ఉన్న పోస్టును షేర్ చేశారు. ఈ పోస్టులో ఎలాంటి వ్యాఖ్యలు లేకపోయినా, ఇండియా టుడే మ్యాగజైన్ ‘‘న్యూస్‌మేకర్స్ ఆఫ్ ఆ ఇయర్ 2025’’ కవర్ పేజీని షేర్ చేశారు. ఈ కవర్ పేజీపై మోడీ, ట్రంప్ ఫోటోలు ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಸಿಸ್ಟೆಂಟ್ ಲೇಬರ್ ಇನ್ಸ್ ಪೆಕ್ಟರ್ ಗೆ ಕಾರು ಹರಿಸಿ ಕೊಂದ ಪ್ರಭಾವಿ ಶ್ರೀಮಂತರ ಮಕ್ಕಳು

ಹೊಸೂರು,ಫೆಬ್ರವರಿ,28,2026 (www.justkannada.in):  ಕ್ಷುಲಕ ಕಾರಣಕ್ಕೆ ಕಾರ್ಮಿಕ ಇಲಾಖೆಯ ಸಹಾಯಕ ನಿರೀಕ್ಷಕರೊಬ್ಬರ  ...

ചരിത്രം കുറിക്കാന്‍ മേനക ഗുരുസ്വാമി; ഇന്ത്യയിലെ ആദ്യ എല്‍.ജി.ബി.ടി.ക്യു.ഐ.എ എംപിയായേക്കും; രാജ്യസഭയിലേക്ക് തൃണമൂല്‍ കരുനീക്കം

കൊല്‍ക്കത്ത: രാജ്യസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ നിര്‍ണ്ണായക സ്ഥാനാര്‍ത്ഥി പ്രഖ്യാപനവുമായി മമത ബാനര്‍ജിയുടെ തൃണമൂല്‍...

'அண்ணா, பெரியார்..? – ஸ்டாலின், உதயநிதி பேனர்களால் நிரம்பிய கோவை மாநாடு!

'என் வாக்குச் சாவடி.. வெற்றி வாக்குச்சாவடி என்ற பெயரில் தி.மு.க வாக்குச்சாவடி...

Meenakshi Chaudhary : బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.!

టాలీవుడ్‌లో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో మీనాక్షి...