29
August, 2026

A News 365Times Venture

29
Saturday
August, 2026

A News 365Times Venture

Shocking: అక్రమ సంబంధం.. మామపై పెట్రోల్ పోసి నిప్పటించిన కోడలి ప్రియుడు..

Date:

Shocking: తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక వృద్ధుడిని నడిరోడ్డపై పెట్రోల్ పోసి తగలబెట్టడం, అతను సాయం కోసం రోడ్డుపై పరిగెత్తుకుంటూ వేడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. జిల్లాలోని పణ్రుట్టి సమీపంలోని మాలిగంపట్టు గ్రామానికి చెందిన రాజేంద్రన్(70) అనే జీడిపప్పు రైతును ఆమె కోడలు, ప్రియుడు కలిసి కుట్ర చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.

Read Also: Border 2 : ‘బోర్డర్’ సినిమాలకు థియేటర్లో పెను ప్రమాదం!

శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో రాజేంద్రన్ తన గ్రామానికి చెందిన కందన్‌తో కలిసి బైక్‌పై మాలిగం పట్టు రోడ్డులో వెళ్తుండగా, అకస్మాత్తుగా కారుతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటలతోనే రాజేంద్రన్ కేకలు వేస్తూ, సాయం కోరాడు. చివరకు అతడికి అంటుకున్న మంటల్ని స్థానికులు ఆర్పివేసి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో ఆయన కడలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మణికందన్(39), కుపేంద్రన్(29), పార్థిబన్(28)లను అరెస్ట్ చేశారు.

ప్రాథమిక విచారణలో రాజేంద్రన్ కొడుకు భూపతితో జయప్రియా(28)కి వివాహం జరిగింది. వీరికి 9 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భూపతి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి కోడలు జయప్రియా మామ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే మణికందన్‌తో జయప్రియాకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన రాజేంద్రన్ కోడల్ని తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. మణికందన్‌కు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాజేంద్రన్‌ను హత్య చేయాలని కుట్ర పన్నారు. మణికందన్ తన స్నేహితులతో కలిసి రాజేంద్రన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ട്രംപ് ഭരണകൂടത്തിലെ ചിലര്‍ ആഗോള ഊര്‍ജ വിപണിയെ സ്വാധീനിക്കാന്‍ ഇടപെടുന്നതായി അരാഗ്ചി

ടെഹ്‌റാന്‍: യു.എസിലെ ഡൊണാള്‍ഡ് ട്രംപ് ഭരണകൂടത്തിലെ ചിലര്‍ ആഗോള ഊര്‍ജ വിപണികളെ...

"மோடிக்கு இணையாக இன்னொரு பிரதமரை சிந்தித்துக்கூட பார்க்க முடியாது"- விஜய் குறித்து தமிழிசை

இந்தியாவின் அடுத்த பிரதமர் விஜய் தான் என்று தவெகவினர் கூறி வருகின்றனர்....

Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..

రెండేళ్లలో నేరిడి బ్యారేజీ పూర్తి చేసి తీరతామని కేంద్ర పౌర విమానయాన...

ಗೃಹಲಕ್ಷ್ಮಿಗೆ ಮೂರು ವರ್ಷದ ಸಂಭ್ರಮ: ಗುಲಾಬಿ ಬಣ್ಣದ ಬೆಳಕಿನಲ್ಲಿ ವಿಧಾನಸೌಧ, ಮೈಸೂರು ಅರಮನೆ..!

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,29,2026 (www.justkannada.in): ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳಲ್ಲೊಂದಾದ ಗೃಹ ಲಕ್ಷ್ಮಿಗೆ...