29
August, 2026

A News 365Times Venture

29
Saturday
August, 2026

A News 365Times Venture

Pat Cummins: టీ20 వరల్డ్‌కప్ 2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ప్యాట్ కమిన్స్ ఔట్!

Date:

Pat Cummins: ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తుది 15 మంది జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ప్రొవిజనల్ స్క్వాడ్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా తాజాగా తుది జట్టును వెల్లడించింది. ఈ జట్టులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో బాధపడుతున్న కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకున్నారు.

Read Also: Aishwarya Rajesh : డోర్ మూసేసి..బాడీ చూపించమన్నాడు..గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన ఐశ్వర్య రాజేష్!

షార్ట్, స్మిత్ ఔట్:
ప్రొవిజనల్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న మ్యాట్ షార్ట్‌ను తుది జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో మ్యాట్ రేన్‌షాను ఎంపిక చేశారు. మరోవైపు అనుభవజ్ఞుడు స్టీవ్ స్మిత్‌కు ఈసారి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు, ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Read Also: భారత మార్కెట్‌లోకి Haier Lumiere Colourful 4 Door Refrigerator.. దీని ప్రత్యేకత, ధర ఏంటంటే..?

కెప్టెన్‌గా మార్ష్:
ఈ మెగా టోర్నమెంట్లో మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్లతో పాటు అనుభవజ్ఞులైన బౌలర్లు, పవర్ హిట్టర్లు జట్టులో ఉండడంతో ఆసీస్ మరోసారి టైటిల్ కోసం గట్టిగా పోటీ పడనుంది.

ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానొల్లి, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, క్యామరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాట్ కూనెమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాట్ రేన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..

రెండేళ్లలో నేరిడి బ్యారేజీ పూర్తి చేసి తీరతామని కేంద్ర పౌర విమానయాన...

ಗೃಹಲಕ್ಷ್ಮಿಗೆ ಮೂರು ವರ್ಷದ ಸಂಭ್ರಮ: ಗುಲಾಬಿ ಬಣ್ಣದ ಬೆಳಕಿನಲ್ಲಿ ವಿಧಾನಸೌಧ, ಮೈಸೂರು ಅರಮನೆ..!

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,29,2026 (www.justkannada.in): ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳಲ್ಲೊಂದಾದ ಗೃಹ ಲಕ್ಷ್ಮಿಗೆ...

യു.പിയില്‍ ബി.ജെ.പി സീറ്റുകള്‍ കുറയും; കാരണം ജെന്‍ സീ അല്ല, മറ്റൊരു തലമുറയെന്ന് സര്‍വേ

ന്യൂദല്‍ഹി: നിലവിലെ സാഹചര്യത്തില്‍ ഉത്തര്‍ പ്രദേശില്‍ ബി.ജെ.പിക്ക് ജയിക്കാവുന്ന സീറ്റുകളുടെ എണ്ണത്തില്‍...

’பெரியார், அம்பேத்கர் பெயர் விடுபட்டதற்கு நானே தார்மீக பொறுப்பு’ – அமைச்சர் சம்பத்குமார் விளக்கம்!

கோவை கவுண்டர்மில்ஸ் பகுதியில் உள்ள தனியார் கல்லூரியில் தமிழ்நாடு வீட்டுவசதி வாரியம்...