28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

Liver Health: ఈ సమస్యలు వస్తే మీ లివర్ ప్రాబ్లమ్‌లో ఉన్నట్టే..?

Date:

లివర్ శరీరంలో ఎంతో అవసరమైన అవయవం, ఎందుకంటే ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి పోషకాలు ఎలా అయితే అందుతాయో, అనవసరమైన లేక వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. అటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి లివర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఉండేటు వంటి కెమికల్స్ స్థాయిలను రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా బైల్ జ్యూస్‌ను తయారు చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ వల్లనే శరీరంలో ఉండేటు వంటి వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇలా శరీరంలో ఎంతో కీలక పాత్ర పోషించే లివర్‌కు ఏమైన సమస్య వస్తే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే లివర్‌ ఆరోగ్యం ప్రమాదంతో పడుతుందన్న విషయాన్ని కొన్ని ముందుస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అవేంటంటే..

READ MORE: Kingdom : కింగ్ డమ్ లో కొత్త విలన్.. ఎవరితను..?

లివర్‌లో ఏదైనా సమస్య ఉంటే ముందుగా కనిపించే లక్షణం పొట్ట ఉబ్బడం. లివర్‌ పనితీరు మెరుగ్గా లేకుంటే ఎప్పుడూ కడుపు ఉబ్బరం ఉన్నట్లు అనిపిస్తుంది. గ్యాస్‌ సమస్య వేధిస్తుంటుంది. లివర్‌ చెడిపోతే కొందరిలో కడుపునొప్పి తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కుడివైపు ఊపిరితిత్తుల కింది భాగంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. ఈ లక్షణాలు ఎక్కువకాలంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. కొందరిలో లివర్‌ పాడైతే చర్మంపై దురదలు, వాపులు వస్తుంటాయి. కొన్ని సార్లు ఇది చర్మ సంబంధిత సమస్యే అయినా లివర్‌ పనితీరు పాడవడం ద్వారా కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.

READ MORE: Gadwal Murder : మరో ఇద్దరితో ఐశ్వర్య ఎఫైర్‌.. తేజేశ్వర్ కేసులో తెరపైకి సంచలన విషయాలు

దీర్ఘకాలంగా అజీర్ణ సమస్యతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం కావడంలో లివర్‌ పాత్ర కీలకం. లివర్‌ పనితీరు దెబ్బతింటే ముందుగా ప్రభావం పడేది జీర్ణ వ్యవస్థపైనే అని గుర్తించాలి. లివర్ దెబ్బతిన్న వారిలో ముందుగా కనిపించే లక్షణాల్లో శరీరం పసుపు రంగులోకి మారడం మరొకటి. చర్మంతో పాటు కళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. కాబట్టి ఈ మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. లివర్‌ సమస్యతో బాధపడేవారిలో కాళ్ల వాపు సమస్య కూడా ఉంటుంది. వాపు ఉన్న చోట నొక్కితే గుంటలా ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

YouTube Shorts‌లో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!

YouTube Shorts‌: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్...

ಪ್ರೇಯಸಿಗೆ ಚಾಕು ಇರಿತ:  ಕಾರು ಸ್ಫೋಟಿಸಿಕೊಂಡು ಪಾಗಲ್ ಪ್ರೇಮಿ ಆತ್ಮಹತ್ಯೆ

ತುಮಕೂರು,ಜೂನ್,27,2026 (www.justkannada.in):  ತನ್ನ ಪ್ರೇಯಸಿಯನ್ನು ಅಪಹರಿಸಿದ ಪಾಗಲ್ ಪ್ರೇಮಿಯೊಬ್ಬ ಆಕೆಗೆ...

മുഖ്യമന്ത്രിയുടെ നിര്‍ദേശമില്ലാതെയാണ് വി.സി നിയമനമെന്ന് വിശ്വസിക്കുന്ന യു.ഡി.എഫ് അണികളും വിസ്മയത്തിന്റെ ഇരകള്‍: എസ്.എഫ്.ഐ

തിരുവനന്തപുരം: കാര്‍ഷിക സര്‍വകലാശാല വൈസ് ചാന്‍സിലറായി ബി.ജെ.പി അനുകൂല സംഘടനാ നേതാവിനെ...

Congress: மாணிக்கம் தாகூர் தலைவராக நியமனம்; தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டியில் அதிரடி மாற்றம்!

தமிழ்நாடு காங்கிரஸ் தலைவராக மாணிக்கம் தாகூர் நியமிக்கப்பட்டுள்ளார். இதற்கு முன் செல்வப்பெருந்தகை...