12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

UP: కసాయి తల్లి.. ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది

Date:

అమ్మ దైవంతో సమానం. నవమోసాలు కని పెంచి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతుంది. అలాంటి కన్న తల్లులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ, ప్రస్తుత రోజుల్లో కొంతమంది తల్లులను చూస్తుంటే.. కంటేనే అమ్మాని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా అని అనాల్సిన పరిస్థితి దాపరించింది. అమ్మతనానికే మాయని మచ్చగా తయారవుతున్నారు కొందరు తల్లులు. పరాయి వ్యక్తుల మోజులో పడి కన్న బిడ్డలను సైతం చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది ఓ కసాయి తల్లి.

Also Read:Gold Rates: ఊరించి.. ఉసూరుమనిపించిన గోల్డ్ ధరలు.. నేడు మళ్లీ పెరిగాయ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ముస్కాన్ (24) అనే మహిళకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ లో నివసిస్తుండడంతో, జునైద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ముస్కాన్. జునైద్‌తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, అడ్డుగా ఉన్న పిల్లలను విషమిచ్చి హతమార్చింది తల్లి. పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:Ananya Nagalla : తన బ్రేకప్ స్టోరీ పంచుకున్న అనన్య నాగళ్ల..

దర్యాప్తులో ఈ మరణాలలో తల్లి ప్రమేయం ఉందని తేలింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, ఆమె నేరం అంగీకరించింది అని అధికారి తెలిపారు. తన ప్రేమికుడు జునైద్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో తన పిల్లలు అడ్డంకిగా ఉన్నారని, అందుకే వారిని చంపాలని నిర్ణయించుకున్నానని ముస్కాన్ చెప్పిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పిల్లలను చంపిన తర్వాత ఆ జంట “హనీమూన్” కి వెళ్లాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. కొంత కాలం క్రితం సంగారెడ్డిలోని అమీన్ పూర్ కు చెందిన ఓ మహిళ తన టెన్త్ క్లాస్ ప్రియుడితో కలిసి బ్రతికేందుకు కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను చింపేసిన విషయం తెలిసిందే.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗೃಹ ಬಳಕೆ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಗೆ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ-ಸಚಿವ ಕೆ.ಎಚ್ ಮುನಿಯಪ್ಪ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,12,2026 (www.justkannada.in):  ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಕೊರತೆ ಎಂಬ ವಿಚಾರ,...

സര്‍ സി.പിയെ ചോദ്യം ചെയ്യാന്‍ മടിക്കാത്ത ആലപ്പുഴയിലെ തൊഴിലാളി വര്‍ഗം ജി. സുധാകരനെയും ചോദ്യം ചെയ്യും: എം. ശിവപ്രസാദ്

തിരുവനന്തപുരം: മുന്‍ മന്ത്രിയും സി.പി.ഐ.എം മുതിര്‍ന്ന നേതാവുമായ ജി. സുധാകരനെതിരെ രൂക്ഷവിമര്‍ശനവുമായി...

Ring Roads In Telangana: తెలంగాణ జిల్లాలకు మహర్దశ.. ప్రతీ జిల్లాకో రింగు రోడ్డు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ.. ప్రతి జిల్లా...