23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

Hyderabad: ముసలోడే కానీ మహా ముదురు..70 ఏళ్ల వయసులో ఏంటి ఈ దుర్బుద్ధి..?

Date:

ఆ వ్యక్తి వయసుల 70 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఈ వయసులో దుర్భుద్ధి ప్రవేశపెట్టాడు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 38.73లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్‌లో ఇరికించి రూ. 38.73లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు. ఫేస్‌ బుక్ లో ఆ వృద్ధుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ మహిళ ఇతడితో ఛాటింగ్ చేసింది. తండ్రి తమను వదిలేశాడని.. తల్లి టైలర్ అని పరిచయం చేసుకుంది. దీంతో ఆ వృద్ధుడు ఇదే ఛాన్స్ అనుకుని ఛాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు.

READ MORE: YS Sharmila: జగన్, కేసీఆర్ ఎంత క్లోజ్ అంటే..? షర్మిల షాకింగ్‌ కామెంట్స్..

ఛాటింగ్ చేసేందకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ వృద్ధుడికి కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది మహిళ. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్‌కి ఫోన్ చేసి రూ.10వేలు పంపాడు వృద్ధుడు. అనంతరం మహిళ నుంచి ఫేస్‌ బుక్ లో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ వృద్ధుడు కేబుల్ ఆపరేటర్ తో ఛాటింగ్ చేశాడు. సదరు మహిళ జబ్బు పడిందని.. ఆస్పత్రిలో ఉందని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు. దీంతో ఆ వృద్ధుడు రూ.10లక్షలు పంపాడు. అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో రూ. 2.65 లక్షలు చెల్లించాడు. కొన్ని రోజుల తర్వత మహిళ దుబాయ్ వెళ్ళిపోయిందని.. ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు.

READ MORE: KCR: కేసీఆర్ సంచలన నిర్ణయం.. రైతుల పక్షాన మరో పోరాటం..!

తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని కేబుల్ ఆపరేటర్ ఆ వృద్ధుడికి చెప్పాడు. అతడికి కోరిక పోలేదు. కొద్ది రోజుల పాటు కేబుల్ ఆపరేటర్ తల్లి, సోదరితో లైంగికంగా ఛాటింగ్ చేశాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కేబుల్ ఆపరేటర్ బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని బాధితుడికి సందేశం పంపాడు. బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం రూ.12.5లక్షలు చెల్లించాడు వృద్ధ బాధితుడు. సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్సైకి రూ. లక్ష సమర్పించుకున్నాడు. కొత్త ఎస్సై వచ్చానని.. కేసు అవ్వకుండా ఉండాలంటే రూ. 10లక్షలు ఇవ్వాలని మరో డిమాండ్ వచ్చింది. దీంతో బాధితుడు మరో రూ. ఏడు లక్షల పంపాడు. ఇలా ఆ వృద్ధుడు మొత్తం రూ. 38.73లక్షలు పొగొట్టుకున్నాడు. ఇన్ని డబ్బులు పొగొట్టుకోవడానికి కారణం.. ఈ వయసులో కూడా లైంగిక కోరికలు ఉండటం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തില്‍ സി.ജെ.പിയുടെ ഫ്യൂച്ചര്‍ പ്ലാന്‍: ഏതെല്ലാം വിഷയം ഏറ്റെടുക്കും, സ്‌കൂള്‍ ഠീക് കരോ എവിടെയെല്ലാം

കോക്രോച്ച് ജനതാ പാര്‍ട്ടി (സി.ജെ.പി) രാജ്യത്താകെ അവരുടെ പ്രവര്‍ത്തനം വ്യാപിപ്പിക്കാനൊരുങ്ങുകയാണ്. ഇതിന്റെ...

`நான் இருக்கேன்' கையில் முத்தமிட்டு ஆறுதல் சொன்ன விஜய்; உருகிய வி.எஸ்.பாபு… 10 நிமிட சந்திப்பு!

75 வயதாகும் வி.எஸ்.பாபுவுக்கு சமீபத்தில் மூச்சுத்திணறல் ஏற்பட்டு, சென்னை நெல்சன் மாணிக்கம்...

iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్‌.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన బడ్జెట్ 5G డివైజ్...

വിവാഹത്തിനും കുടുംബ ചടങ്ങിനും ഹെലികോപ്റ്റര്‍; മുഖ്യമന്ത്രിയെ പരിഹസിച്ച് വി. ശിവന്‍കുട്ടി

തിരുവനന്തപുരം: മുഖ്യമന്ത്രിയുടെ ചാര്‍ട്ടേഡ് വിമാനയാത്രയില്‍ പരിഹാസവുമായി മുന്‍ മന്ത്രി വി ശിവന്‍കുട്ടി....