23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

Lucknow: హజ్ యాత్రికుల విమానంలో మంటలు.. లక్నోలో సురక్షితంగా ల్యాండింగ్

Date:

హజ్ యాత్రికులతో ఉన్న విమాన చక్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లక్నో ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. హైడ్రాలిక్ లీక్ కారణంగా చక్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Disha Patani : ప్రతి ఒక్క ఓటమిని స్వీకరిస్తా..

సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV 3112 విమానం శనివారం రాత్రి 10.45 గంటలకు జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో లక్నోకు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గుర్తించాడు. పైలట్ వెంటనే విమానాన్ని ఆపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం విమానాన్ని వెనక్కి నెట్టి టాక్సీవేకు తరలించారు. అక్కడ ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించేశారు.

ఇది కూడా చదవండి: Israel-Iran War: ఇజ్రాయెల్ నిప్పుల వర్షం.. బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

ఇక విమానాశ్రయ అత్యవసర బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. నురుగు మరియు నీటిని ఉపయోగించి 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అకస్మాత్తుగా హైడ్రాలిక్ లీక్ కావడం వల్లే వీల్ చక్రం హీటెక్కినట్లుగా గుర్తించారు. టేకాఫ్ సమయంలో ఈ సమస్య జరిగి ఉంటే తీవ్రమైన ప్రమాదానికి దారితీసి ఉండేదని అధికారులు తెలిపారు. జెడ్డా నుంచి హజ్ యాత్రికులను తీసుకువచ్చిన ఈ విమానం సౌదీ అరేబియాకు తిరిగి ఖాళీగా వెళ్లాల్సి వచ్చింది.

ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రయాణికులు చనిపోయారు. అలాగే హాస్టల్ మీద కూలడంతో 34 మంది మెడికోలు కూడా చనిపోయారు. చికిత్స పొందుతున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరుగుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തില്‍ സി.ജെ.പിയുടെ ഫ്യൂച്ചര്‍ പ്ലാന്‍: ഏതെല്ലാം വിഷയം ഏറ്റെടുക്കും, സ്‌കൂള്‍ ഠീക് കരോ എവിടെയെല്ലാം

കോക്രോച്ച് ജനതാ പാര്‍ട്ടി (സി.ജെ.പി) രാജ്യത്താകെ അവരുടെ പ്രവര്‍ത്തനം വ്യാപിപ്പിക്കാനൊരുങ്ങുകയാണ്. ഇതിന്റെ...

`நான் இருக்கேன்' கையில் முத்தமிட்டு ஆறுதல் சொன்ன விஜய்; உருகிய வி.எஸ்.பாபு… 10 நிமிட சந்திப்பு!

75 வயதாகும் வி.எஸ்.பாபுவுக்கு சமீபத்தில் மூச்சுத்திணறல் ஏற்பட்டு, சென்னை நெல்சன் மாணிக்கம்...

iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్‌.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన బడ్జెట్ 5G డివైజ్...

വിവാഹത്തിനും കുടുംബ ചടങ്ങിനും ഹെലികോപ്റ്റര്‍; മുഖ്യമന്ത്രിയെ പരിഹസിച്ച് വി. ശിവന്‍കുട്ടി

തിരുവനന്തപുരം: മുഖ്യമന്ത്രിയുടെ ചാര്‍ട്ടേഡ് വിമാനയാത്രയില്‍ പരിഹാസവുമായി മുന്‍ മന്ത്രി വി ശിവന്‍കുട്ടി....