25
August, 2026

A News 365Times Venture

25
Tuesday
August, 2026

A News 365Times Venture

Kavitha: కేసీఆర్‌తో మాట్లాడానో.. లేదన్నది ఇప్పుడు అనవసరం

Date:

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తన తండ్రి కేసీఆర్‌తో మాట్లాడానో.. లేదన్నది ఇప్పుడు అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. కవిత మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇటీవల ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసేందుకు కవిత వెళ్లింది. కవితను పలకరించకుండానే కేసీఆర్ బయటకు వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే అంశంపై కవిత నోరు విప్పారు. ఫాంహౌస్‌కు వెళ్లినప్పుడు మా నాన్నతో మాట్లాడానో లేదో అనేది ఇప్పుడు అనవసరమైన మేటర్ అంటూ కొట్టిపారేశారు. ఇక కేటీఆర్ విచారణకు వెళ్తున్నప్పుడు వెళ్లాలో.. వద్దో అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయినా విచారణ సమయంలో ఎవరినీ రానీయకుండా దూరంగానే అడ్డుకుంటున్నారు కదా? అని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ నార్మల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారన్నారు. బోన్‌కు ఇంజక్షన్ వేయించుకుంటున్నారని.. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ట్రీట్‌మెంట్ ఇప్పుడు జరుగుతోందని కవిత వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Vijay Rupani: రెండుసార్లు ఫ్లైట్ టికెట్ క్యాన్సల్.. మూడోసారి మృత్యువు ఒడిలోకి..

సీఎం రేవంత్‌రెడ్డి.. మోడీని కలిసి 26 అంశాలై వినతిపత్రం ఇచ్చారని.. కానీ అందులో బీసీ బిల్లు లేదన్నారు. బీసీ బిల్లు అమలు కావాలనే చిత్తశుద్ధి రేవంత్‌రెడ్డికి లేదని ఆరోపించారు. బీసీ బిల్లు అమలు కోసం గట్టిగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈనెల 17న జాగృతి ఆధ్వర్యంలో మెదక్‌లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలను మార్చారని.. పుస్తకాలపై కొమురం భీమ్ బొమ్మను తీసివేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉద్యోగి అని ఆయనే చెప్పారని… ఆయనకు వాళ్ల ముఖ్య నేతలే అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదన్నారు. వేరే వాళ్ల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు.

ఇది కూడా చదవండి: Air India Crash: విమానాల్లో సురక్షితమైన సీట్లు ఉంటాయా.? నిపుణులు ఏం చెబుతున్నారు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

JustKannada ವರದಿಗೆ ಪಾಲಿಕೆ ಆಯುಕ್ತೆಯ ತಕ್ಷಣದ ಸ್ಪಂದನೆ: 24 ಗಂಟೆಯೊಳಗೆ ಅಪಾಯಕಾರಿ ಕೊಂಬೆ ತೆರವು

ಮೈಸೂರು. ಆಗಸ್ಟ್,25,2026 (www.justkannada.in): ನಗರದ ಚಾಮರಾಜಪುರಂ ಬಜ್ಜಣ್ಣ ಲೇನ್‌ ನ...

രാജ്യത്തെ മിസൈല്‍ സാങ്കേതിക വിദ്യകള്‍ സ്വകാര്യ മേഖലയ്ക്ക് കൈമാറാന്‍ തീരുമാനവുമായി പ്രതിരോധ മന്ത്രാലയം

ന്യൂദല്‍ഹി: പൊതുമേഖലാ പ്രതിരോധ ഗവേഷണ സ്ഥാപനമായ ഡി.ആര്‍.ഡി.ഒ വികസിപ്പിച്ചെടുത്ത പരമ്പരാഗത മിസൈല്‍...

"செங்கோட்டையன் பேசுறது சரியா…" – ஆளுநரிடம் கொதித்த டி.டி.வி.தினகரன்!

சட்டப்பேரவைக் கூட்டத்தொடர் ரணகளக் காட்சிகளுடன் நடந்து வரும் நிலையில், திடீர் அரசியல்...

Off The Record: కొండా సురేఖ వివాదంపై మంత్రి సీతక్క మౌనం..!!

Off The Record: కొండా కుటుంబం కేంద్రంగా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న...