22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

Operation Sindoor: ఉదయం 5.45 గంటలకు భారత సైన్యం అత్యవసర మీడియా సమావేశం..

Date:

Operation Sindoor: పాకిస్తాన్‌లో భారత్ విధ్వంసం సృష్టిస్తోంది. పాకిస్తాన్ రెండు రోజులుగా చేస్తున్న డ్రోన్ దాడులకు ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేస్తూ భారీ దాడులు చేసింది. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి లక్ష్యంగా వీరంగం సృష్టించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ బేస్‌ని ధ్వంసం చేసింది. దీంతో పాటు రఫికీ ఎయిర్ బేస్, మురిద్ ఎయిర్ బేస్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. వస్తున్న సమాచారం ప్రకారం, పాక్ వ్యాప్తంగా అన్ని ఎయిర్ బేస్‌లను నాశనం చేసినట్లు తెలుస్తోంది. లాహోర్, ఇస్లామాబాద్, సియాల్‌కోట్ ‌లపై దాడులు జరిగాయి.

Read Also: Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..

ఇదిలా ఉంటే, ఈ రోజు తెల్లవారుజామున 5.45 గంటలకే ఇండియన్ మిలిటరీ మీడియా సమవేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. పాకిస్తా్న్ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌత్ బ్లాక్ లో మీడియా సమావేశం జరగబోతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನೇಮಕಾತಿ ಪ್ರಮಾಣಪತ್ರ ಪಡೆಯಲು ಬಂದಿದ್ದ ವೇಳೆ ಕಾರು ಡಿಕ್ಕಿ: ವಿದ್ಯಾರ್ಥಿ ಸ್ಥಳದಲ್ಲೇ ಸಾವು

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌,22,2026 (www.justkannada.in) ಕಾಲೇಜು ಮುಂಭಾಗ ನಿಂತಿದ್ದ ವೇಳೆ ಕಾರು ಡಿಕ್ಕಿಯಾಗಿ...

ഹൈദരാബാദ് ഗണേശോത്സവം; ഘോഷയാത്ര കടന്ന് പോവുന്ന പാതകളിലെ പള്ളികള്‍ തുണികൊണ്ട് മൂടി

ഹൈദരാബാദ്: 2026ലെ ഗണേശ ഘോഷയ്ക്ക് മുന്നോടിയായി ജാഥ കടന്ന് പോവുന്ന പ്രധാന...

"இடைத்தேர்தலைத் திணிப்பவர்களே தேர்தல் செலவையும் ஏற்க வேண்டும்" – தாராபுரத்தில் சீமான் ஆவேசம்

மதுராந்தகம், தாராபுரம் ஆகிய இரண்டு தொகுதிகளில் இடைத்தேர்தலுக்கான வாக்குப்பதிவு அக்டோபர் 6...

Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!

Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది...