29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Muttamsetti Lakshmi Priyanka: వైసీపీకి మరో షాక్.. విశాఖ కార్పొరేటర్‌, మాజీ మంత్రి అవంతి కూతురు రాజీనామా..

Date:

Muttamsetti Lakshmi Priyanka: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.. కూటమి ప్రభుత్వం గ్రేటర్‌ విశాఖ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో.. వైసీపీ కార్పొరేటర్లు.. వరుసగా కూటమి పార్టీల గూటికి చేరుతున్నారు.. ఇక, మేయర్ అవిశ్వాస పరీక్ష ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక.. ఆమె, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె కావడం ఇక్కడ చర్చగా మారింది..

Read Also: Minister Ponmudy: ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..

ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 6వ వార్డు కార్పొరేటర్‌ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక.. నేను నా వ్యక్తిగత కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను.. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. ఇట్లు, మీ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక, 6వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్, చీఫ్ విప్ జీవీఎంసీ.. అంటూ తన రాజీనామా లేఖ రాశారు ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక. కాగా, మేయర్‌ ఎన్నికల సమయంలో ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక.. ఇప్పుడు ఏ పార్టీలో చేరతారు అనేది ఆసక్తికరంగా మారింది..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನೈಸ್ ದಾರಿ ತಪ್ಪುವುದಕ್ಕೆ  HDK ಅಂಡ್ ಫ್ಯಾಮಿಲಿ ಕಾರಣ-ಸಚಿವ ಚಲುವರಾಯಸ್ವಾಮಿ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,29,2026 (www.justkannada.in): ನೈಸ್ ಯೋಜನೆ ಅಕ್ರಮ ವಿಚಾರವಾಗಿ ಸಿಎಂ ಡಿಕೆ...

മോദിയെ വിമർശിച്ചതിന് പിന്നാലെ നടപടി; കാർട്ടൂണിസ്റ്റ് സതീഷ് ആചാര്യയുടെ ഇൻസ്റ്റാഗ്രാം പേജ് ഇന്ത്യയിൽ ബ്ലോക്ക് ചെയ്തു

ന്യൂദൽഹി: പ്രമുഖ രാഷ്ട്രീയ കാർട്ടൂണിസ്റ്റ് സതീഷ് ആചാര്യയുടെ ഇൻസ്റ്റാഗ്രാം അക്കൗണ്ടിന് ഇന്ത്യയിൽ...

"நான் அவர்களை குறிப்பிடவில்லை, மோகன் குமாரமங்கலம் எனக்கு தோழர்.!"- சர்ச்சைக்கு ராஜ்மோகன் விளக்கம்

தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் தன்னிச்சையாக செயல்பட்டிருப்பதால் அவர் பதவி விலக...

Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..

తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన...