2
May, 2026

A News 365Times Venture

2
Saturday
May, 2026

A News 365Times Venture

Fire Accident : భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి

Date:

Fire Accident : హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో బోట్లపై బాణాసంచా కాల్చుతుండగా, అగ్ని ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లు మంటల్లో కాలి పోయాయి. ఈ బోట్లలో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, వారందరూ బోట్ల నుంచి దూకడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంటలను సహాయక బృందాలు వెంటనే అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Best 5G smartphones: రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

భారత మాతకు మహా హారతి కార్యక్రమం ముగింపునకు దగ్గర్లో ఉండగానే ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, బీజేపీ నేతలు, ప్రముఖ సినీ దర్శకుడు ఎంఎం కీరవాణి, నాగఫణి శర్మ తదితరులు హాజరయ్యారు. కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకలను ఆనందించారు. కిషన్ రెడ్డితో పాటు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ భారత మాతకు మహా హారతి కార్యక్రమానికి మానసిక ఉత్సాహాన్ని పంచారు.

Yogi Adityanath: ‘‘సనాతన ధర్మం జాతీయ మతం’’..సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വസ്തുതകള്‍ വളച്ചൊടിക്കുന്നു; പശ്ചാത്യ മാധ്യമങ്ങള്‍ ഇസ്രഈലിന്റെ വംശഹത്യയെ വെള്ളപൂശുന്നു

ടെഹ്‌റാന്‍: ഗസയിലെ ഇസ്രഈലി ആക്രമണങ്ങളെ പാശ്ചാത്യ മാധ്യമങ്ങള്‍ സജീവമായി പിന്തുണയ്ക്കുകയും ന്യായീകരിക്കുകയും...

'தவெக-விடம் ஆட்சியை பிடிக்கும் அளவிற்கு வலிமை இல்லை' – திருமாவளவன் பேச்சு

நடந்து முடிந்த தமிழ்நாடு சட்டமன்ற தேர்தலில், திமுக கூட்டணி தான் வெற்றி...

Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..

Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)...

ಕಾನೂನಿನ ಚೌಕಟ್ಟಿನಲ್ಲಿ ಕಾರ್ಯ ನಿರ್ವಹಿಸಿ: ಕುಡಿಯುವ ನೀರಿನ ಬಗ್ಗೆ ನಿರಂತರ ನಿಗಾ ವಹಿಸಿ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು,ಮೇ,2,2026 (www.justkannada.in): ತಮ್ಮ ವ್ಯಾಪ್ತಿಯ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿನ ಕುಡಿಯುವ ನೀರಿನ ಪರಿಸ್ಥಿತಿ...