16
August, 2026

A News 365Times Venture

16
Sunday
August, 2026

A News 365Times Venture

JEE Mains Exams: రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు..!

Date:

జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 22 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ పరీక్షలు ఈ నెల 22 నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే పూర్తి చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు.. పరీక్ష రాసే విద్యార్థులకు NTA కీలక సూచనలు జారీ చేసింది.

Read Also: Tech Tips: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా?.. వీటి ఉపయోగం ఏంటో తెలుసా?

కీలక సూచనలు:
పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకపోతే ఎగ్జా్మ్ హాల్ లోకి ఎంట్రీ ఉండదు.
ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి. (పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు).
అలాగే.. ఆన్‌లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసినటువంటి పాస్ పోర్టుసైజు ఫొటోను తీసుకెళ్లాలి.. అటెండెన్స్ షీట్‌పై అతికిస్తారు.
విద్యార్థులు బాల్ పాయింట్ పెన్ మాత్రమే వినియోగించాలి.
దివ్యాంగులైన విద్యార్థులు తమ వెంట మెడికల్ సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి.
జామెట్రీ బాక్స్, బ్యాగ్, పర్సు, ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్, డాక్యుపెన్ వంటివి తీసుకెళ్లకూడదు.
అంతేకాకుండా.. ఎక్కువ పాకెట్స్ ఉన్న బట్టలు ధరించరాదు. నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"தமிழ்நாடு முழுக்கவே வம்பு இழுத்து வைத்திருக்கிறேன்!"- சொல்கிறார் அமைச்சர் பிரபு

பாரம்பர்ய அரசியல் குடும்பத்திலிருந்து த.வெ.க-வுக்குள் அடியெடுத்துவைத்த டாக்டர் து.க.பிரபு, காரைக்குடி தொகுதியில்...

Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్.. మహిళ గిన్నిస్‌ రికార్డు..

Guinness World Record: పుష్‌అప్స్‌ చేయడమే చాలా మందికి కష్టంగా ఉంటుంది.....

 പറയൂ, നിങ്ങൾ ഏത് സ്വാതന്ത്ര്യ സമരത്തിലാണ് പങ്കെടുത്തത്: ആർ.എസ്.എസിനോട് പ്രിയങ്ക് ഖാർഗെ

കലബുർഗി: സ്വാതന്ത്ര്യ സമരവുമായി ബന്ധപ്പെട്ട് ആർ.എസ്.എസ് ഉന്നയിക്കുന്ന അവകാശ വാദങ്ങളെ ചോദ്യം...

திருநெல்வேலியில் நடைபெற்ற 80-வது சுதந்திர தின விழா புகைப்படத்தொகுப்பு! | Photo Album

திருநெல்வேலியில் நடைபெற்ற  80-வது சுதந்திர தின விழா புகைப்படத்தொகுப்பு.!விஜய் குறித்து நயினார் சர்ச்சைப்...