20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

OTR: ఆలేరు కాంగ్రెస్ పార్టీలో వీధికెక్కిన కుమ్ములాటలు

Date:

OTR: ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కుమ్ములాటలు స్థాయిదాటి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందా? ఎమ్మెల్యేకి, కార్పొరేషన్ ఛైర్‌ పర్సన్‌కి అస్సలు పడటం లేదా? ఆడబిడ్డకు పదవి వస్తే… కనీసం ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానిస్తారా అంటూ ఓ మాజీ మంత్రి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీద ఫైరైంది నిజమేనా? ఎక్కడ జరుగుతోందా రాజకీయం? ఎవరా ఇద్దరు? వాళ్ళ మధ్యన జోక్యం చేసుకున్న సీనియర్‌ ఎవరు? ఆలేరు నియోజకవర్గంలో హస్తం పార్టీ నేతల మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోంది. కొద్ది కాలంగా ముఖ్య నేతలు నోటితో మాట్లాడుకుంటూ నొసటితో వెక్కిరించుకుంటున్నారట. ఇప్పుడది ముదిరి పాకాన పడి తాజాగా.. కలిసి వేదికలు పంచుకోవడానికి కూడా ముందుకురాని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి… ఆలేరులో నిర్వహించిన అలయ్ బలయ్ ఇందుకు వేదికైంది. పిలిచినా… స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ప్రోగ్రామ్‌కి వస్తానని ముందు చెప్పిన బీర్ల… ఆ రోజున నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోవడం, ఆయన ముఖ్య అనుచరులు, నియోజకవర్గ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్‌ నేతల మధ్య గ్యాప్‌ బాగా పెరిగిపోయిందని మాట్లాడుకుంటున్నారు.

అలయ్‌ బలయ్‌కి తప్పకుండా వస్తామని అంతకు ముందు శోభారాణికి హామీ ఇచ్చిన వాళ్ళు కూడా… ఎమ్మెల్యే రావడం లేదని తెలిసి గైర్హాజరయ్యారట. బండ్రు శోభారాణికి, ఎమ్మెల్యే ఐలయ్యకు మధ్య చాలా కాలంగా గ్యాప్‌ ఉంది. శోభారాణి రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌ అయ్యాక కూడా… నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించకపోవడం రోటీన్ అయిందని అంటున్నారు. స్థానికంగా జరిగే కీలక అధికారిక కార్యక్రమాలకు, పార్టీ ప్రోగ్రామ్స్‌కు ఆమెకు ఆహ్వానమే అందడంలేదట. ఇక ఫ్లెక్సీల్లో ఆమె ఫోటో ఎప్పుడో మాయం అయ్యిందని అంటున్నారు. ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరును బండ్రు ప్రశ్నించడంతోపాటు… పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మాత్రం మార్పు లేదట. దాంతో… ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరుగుతోందని ఆమె కూడా ఫిక్స్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసిన బండ్రు శోభారాణి అప్పటి నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ రేస్‌లో ఉంటున్నారు. ఇక తాజా అలయ్ బలయ్ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు మినహా.. మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. సొంత పార్టీ నేతలు ఇలా చేయడంపై శోభారాణి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి త్యాగం చేస్తే ఆడబిడ్డను అవమానిస్తారా అంటూ ఆమె తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

ఓవైపు శోభారాణి అసంతృప్తి చర్చనీయాంశం కాగా.. ఇదే కార్యక్రమానికి హాజరైన మోత్కుపల్లి నరసింహులు సైతం ఎమ్మెల్యే తీరు సరిగా లేదని అనడం, అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటే ఎలాగని కామెంట్‌ చేయడం రాజకీయంగా నియోజకవర్గంలో కాక రేపుతోంది. దీంతో… ఎమ్మెల్యేతో గ్యాప్‌ ఉన్న నేతలంతా ఒకే వేదిక పైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న సందేహాలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేకు అన్నీ తామై వ్యవహరించే నలుగురైదుగురు… కొంతకాలంగా చక్కబెడుతున్న వ్యవహారాలు వివాదాస్పదం అవుతున్నాయని, అసంతృప్త నేతలకు ఏవే ఆస్త్రాలుగా మారతాయని కాంగ్రెస్‌ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో పెట్టడం సరికాదని… కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసుకుంటే చివరికి మిగిలేది ఏంటో అందరికీ తెలుసునని ఎమ్మెల్యే గురించి ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు ఆలేరు నియోజకవర్గంలో.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വോട്ടർ പട്ടിക പരിഷ്കരണത്തിലൂടെ ഇന്ത്യ ന്യൂനപക്ഷങ്ങളെ ലക്ഷ്യമിടുന്നതായി യു.എസ് മതസ്വാതന്ത്ര്യ സമിതി

വാഷിങ്ടൺ: രാജ്യവ്യാപകമായി നടന്ന വോട്ടർ പട്ടിക പരിഷ്കരണത്തിലൂടെ ഇന്ത്യ മതന്യൂനപക്ഷങ്ങളെ ലക്ഷ്യമിടുന്നത്...

"வி.எஸ்.பாபு உடல்நிலை குறித்து மௌனம் காத்தது மனித உரிமை மீறல்" – டாக்டர் கிருஷ்ணசாமி கூறுவது என்ன?

"ஒரு மக்கள் பிரதிநிதியின் உடல்நிலை குறித்து மூன்று மாதங்கள் மருத்துவமனையும், அரசும்...

ദാരിദ്ര നിര്‍മാജനം മുന്‍ സര്‍ക്കാരുകളുടെ പ്രവര്‍ത്തനഫലം; മോദിയുടെ അവകാശവാദത്തിനെതിരെ അധീര്‍ രഞ്ജന്‍ ചൗധരി

ദല്‍ഹി: ഇന്ത്യയിലെ ദാരിദ്ര്യ നിര്‍മാജനവുമായി ബന്ധപ്പെട്ട് പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദി നടത്തിയ...