రాబోయే ‘ఏసీసీ రైజింగ్ ఆసియా కప్’ టోర్నమెంట్ కోసం ప్రకటించిన ఇండియా-ఏ జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక మార్పులు చేసింది. ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రజత్ పటీదార్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్ ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని, గాయం తీవ్రత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పటీదార్ బీసీసీఐకి తెలిపారు. పటీదార్ స్థానంలో యువ హిట్టర్ రింకూ సింగ్ నూతన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే పటీదార్ స్థానంలో ఐయుష్ బదోనిని రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి తీసుకున్నారు. ఈ రైజింగ్ ఆసియా కప్ టోర్నమెంట్ నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇండియా-ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ వంటి ఐపిఎల్, అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
ఇండియా-ఎ జట్టు గ్రూప్-బీలో ఉంది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్-ఏ, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న నేపాల్‌తో ఆడనుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్-ఏ మ్యాచ్ నవంబర్ 22న జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 24న యూఏఈతో భారత్ తలపడుతుంది. రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 29న జరుగుతుంది.
ఇండియా-ఏ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రింకూ సింగ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుషాగ్ర (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రాజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కొటియాన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్.





