8
November, 2026

A News 365Times Venture

8
Sunday
November, 2026

A News 365Times Venture

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం

Date:

యువ సంచలనం, బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) బీహార్ సీనియర్ క్రికెట్ జట్టుకు (Bihar Senior Cricket Team) కెప్టెన్‌గా (Captain) నియమించారు. తన కెరీర్‌లో తొలిసారిగా సీనియర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టు పగ్గాలను వైభవ్‌కు అప్పగించారు. అలాగే సూరజ్ కశ్యప్‌ను (Suraj Kashyap) వైస్ కెప్టెన్‌గా (Vice-Captain) ఎంపిక చేశారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) శుక్రవారం ఈ మేరకు జట్టు వివరాలను ప్రకటించింది. టోర్నమెంట్‌లో భాగంగా బీహార్ తన తొలి మ్యాచ్‌ను నవంబర్ 14న ఇండోర్‌లో సౌరాష్ట్రతో (Saurashtra) ఆడనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్-బిలో (Group-B) బీహార్ జట్టు చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో ఢిల్లీ, హర్యానా, జమ్మూ-కశ్మీర్, పంజాబ్, రైల్వేస్, సౌరాష్ట్ర, తమిళనాడు జట్లు ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌లకు వైభవ్ సూర్యవంశీ జట్టును నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు.

ఇక, ఐపీఎల్ 2026 (IPL 2026) టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరఫున ఆడిన వైభవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులు చేసిన వైభవ్ ఏకంగా 237కి పైగా స్ట్రైక్ రేట్‌తో చెలరేగాడు. అంతేకాకుండా, భారత టీ20 అంతర్జాతీయ జట్టులో సైతం ఎపికై.. ఇప్పటివరకు 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అండర్-19 వరల్డ్ కప్ (Under-19 World Cup) ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగుల భారీ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఫైనల్ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

యువ ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ స్పందిస్తూ.. కెప్టెన్సీ ద్వారా వైభవ్ ఒక లీడర్‌గా మరింత ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పరిణతిని ప్రదర్శించాడని కొనియాడారు. వైభవ్ నాయకత్వంలో జట్టు క్రమశిక్షణతో (Discipline) రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల బీహార్ జట్టులో వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), అలోక్ కుమార్, ఆయుష్ లోహరుక (వికెట్ కీపర్), అల్తమశ్ అష్రఫ్, పరం కుమార్ సింగ్, అన్మోల్ కుమార్ (వికెట్ కీపర్), ఋత్విక్ రాజ్, సూరజ్ కశ్యప్ (వైస్ కెప్టెన్), మయాంక్ కుమార్, రాఘవేంద్ర ప్రతాప్, ఆశిష్ కుమార్, వాసుదేవ్ ప్రతాప్ సింగ్, మొహమ్మద్ ఇజహార్, అమోద్ యాదవ్, ప్రశాంత్ సింగ్, నవాజ్ ఖాన్, హిమాన్షు సింగ్ చోటు దక్కించుకున్నారు. అలాగే స్టాండ్‌బై ఆటగాళ్లుగా (Standby Players) బిపిన్ సౌరభ్, సుమన్ కుమార్, ఆకాష్ రాజ్, ఖాలిద్ ఆలం, భాస్కర్ దూబే, కుమార్ రజనీశ్, సుయాశ్, అభిజీత్ సాకేత్, యశస్వి రిషవ్, లఖన్ రాజా, పవన్ కుమార్, అమిత్ చౌదరి, పీయూష్ సింగ్, భాను కుమార్, లోకేష్ బాబూలాల్ కుమార్, ప్రశాంత్ శ్రీవాస్తవ ఎంపికయ్యారు. కాగా, మంగళ్ మహౌర్, సాకిబ్ హుసేన్ ద్వయం తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత తమ ఫిట్‌నెస్ పరీక్ష ఆధారంగా జట్టులోకి అందుబాటులోకి రానున్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..

Mitchell Santner: వెల్లింగ్‌టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టుపై...

വൈദ്യുതി കരാര്‍: മറുപടി നല്‍കിയിട്ടും പ്രതിപക്ഷ നേതാവ് ആരോപണം വീണ്ടും ഉന്നയിക്കുന്നാണ് ദുരൂഹതയെന്ന് മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: വൈദ്യുതി കരാറില്‍ ദുരൂഹതയുണ്ടെന്ന് പ്രതിപക്ഷ നേതാവ് പിണറായി വിജയന്റെ ആരോപണങ്ങളില്‍...

‘சண்டியர் என படம் எடுத்தால் கமல்ஹாசன் தமிழகத்தை விட்டே ஓட வேண்டியிருக்கும்’ – டாக்டர் கிருஷ்ணசாமி!

கோவை குனியமுத்தூரில் பகுதியில் புதிய தமிழகம் கட்சித் தலைவர் டாக்டர் கிருஷ்ணசாமி...