2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..

Date:

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరుతో నిర్వహించిన మహాసభ భారీ జనసందోహం మధ్య సాగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు, విద్యార్థులు, రైతులు, విపక్ష పార్టీల కార్యకర్తలతో మైదానం కిక్కిరిసిపోయింది. ఈ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ తదితర నేతలు కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

మోదీ, షాపై ఖర్గే ఫైర్

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి మహిళలు, దళితులు, యువత ఓట్లను దొంగిలించేందుకు కుట్ర పన్నారని ఖర్గే ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పనిచేస్తూ ఓట్ల చోరీకి సహకరిస్తున్నారని విమర్శించారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ భూమిపై ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాం’’ అని హెచ్చరించారు. మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల తీర్పుతో గెలవలేదని ఆరోపించారు. సీబీఐ, ఈడీతో విపక్షాలను భయపెట్టాలని చూస్తున్నా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. మోదీని గద్దె దించితేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమని పిలుపునిచ్చారు.

ఓటర్ల పేర్ల తొలగింపుపై రాహుల్ ఆగ్రహం

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో విపక్ష నేతలు చేపట్టిన మార్చ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం భయపడి కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను బలవంతంగా మూయించిందని ఆరోపించారు. వ్యాపారులను భయపెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది పేర్లను తొలగించి ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తున్న శక్తుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.

డబుల్ జీరోగా మారింది: అఖిలేశ్

ఉత్తరప్రదేశ్‌లోని డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు ‘డబుల్ జీరో’గా మారిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. యూపీలో 1.27 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాతే ఈ విషయం వారికి అర్థమైందని విమర్శించారు.

ఓటు చోరులపై మహాభారతం: తేజస్వి

రామ్‌లీలా మైదానంలో సాధారణంగా రామాయణ గాథలు వినిపిస్తాయని, కానీ ఇప్పుడు ఓటు చోరులకు వ్యతిరేకంగా మహాభారతం జరుగుతోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర పాలకులు శకుని మాదిరిగా అక్రమ పావులు కదుపుతున్నారని విమర్శించారు. వారికి బుద్ధి చెప్పేందుకు ఈ మైదానాన్ని కురుక్షేత్రంగా మారుస్తామని హెచ్చరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను మోదీకి కీలుబొమ్మగా అభివర్ణించారు. రాజ్యాంగ పదవుల్లో ఉండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

సీఈసీ రాజీనామాకు డిమాండ్

ఈ సభలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తదితరులు ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి రాజకీయ భవిష్యత్తును మార్చేందుకు కుట్ర జరుగుతోందని విపక్ష నేతలు ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు బదులుగా మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావడానికి ఈ సభ కీలకంగా నిలుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഒക്ടോബറില്‍ വെസ്റ്റ് ബാങ്കില്‍ ഇസ്രഈലി അധിനിവേശകരുടെ 397 ആക്രമണങ്ങള്‍; 20 വര്‍ഷത്തിനിടയിലെ ഏറ്റവും ഉയര്‍ന്ന കണക്ക്

ജെറുസലേം: വെസ്റ്റ് ബാങ്കില്‍ ഇസ്രായേലി അധിനിവേശകരുടെ ആക്രമണങ്ങള്‍ ഒക്ടോബര്‍ മാസത്തില്‍ മുമ്പെന്നുമില്ലാത്ത...

"'Take Diversion!' முதலீட்டைத் தாரை வார்கிறது தவெக" – 'திருமலை' பட காமெடியை வைத்து இபிஎஸ் விமர்சனம்

அக்டோபர் மாத ஜிஎஸ்டி வரி வருவாயில் தமிழ்நாடு வெறும் 3% வளர்ச்சியோடு...

എസ്.ഐ.ആറിന് ശേഷം ബെംഗളൂരുവിലെ വോട്ടര്‍ പട്ടികയിലെ എന്‍ട്രികളില്‍ പേരുകള്‍ക്ക് പകരം ചോദ്യചിഹ്നങ്ങളും മനസ്സിലാകാത്ത വാക്കുകളും

ബെംഗളൂരു: ബെംഗലൂരുവില്‍ എസ്.ഐ.ആര്‍ നടപ്പാക്കിയ ശേഷം പ്രസിദ്ധീകരിച്ച അന്തിമ വോട്ടര്‍ പട്ടികയിലെ...

தேசிய நெடுஞ்சாலையில் தவெக அமைச்சரின் காரை மறித்த போராட்டக்காரர்கள்; பரபரப்புக்குள்ளான வேலூர்

வேலூர் மாநகராட்சிக்கு உட்பட்ட சத்துவாச்சாரி அருகேயுள்ள நடப்பாறை பகுதியில், 1981-ம் ஆண்டு...