4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..

Date:

కార్పొరేట్ ఉద్యోగానికి తోడుగా అదనపు ఆదాయం సంపాదించాలనే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆశ మొదటి రోజే ఆవిరైపోయింది. ఆటో కొనుగోలు చేసి సైడ్ బిజినెస్ చేద్దామని భావించిన అతనికి చేదు అనుభవం ఎదురైంది. డ్రైవర్ ఏకంగా ఆటోతో సహా పరారవ్వడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గౌరవ్ తోమర్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ ఘటనకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తనతో పనిచేసే ఒక కొలీగ్‌కు ఉద్యోగంతో పాటు అదనపు సంపాదన కోసం ఆటో కొనుగోలు చేయాలనే సలహా వారి ఆఫీస్ ప్యూన్ ఇచ్చాడు. ఆటో కొని రోజువారీ అద్దెకు ఇస్తే రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు ఆదాయం వస్తుందని, పైగా ఆఫీస్ రాకపోకలకు కూడా ఉపయోగపడుతుందని ప్యూన్ నమ్మబలికాడు.

ప్యూన్ మాటలు నమ్మిన సదరు ఇంజనీర్ సుమారు రూ.1.75 లక్షలు వెచ్చించి కొత్త ఆటోను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆటో నడపడానికి బీహార్‌కు చెందిన ఒక డ్రైవర్‌ను ప్యూన్ సిఫారసు చేయగా.. రోజుకు రూ.600 అద్దెకు ఒప్పందం కుదుర్చుకుని అతనికి వాహనాన్ని అప్పగించారు. అయితే.. నూతనోత్సాహంతో ప్రారంభించిన ఈ సైడ్ బిజినెస్ మొదటి రోజే బెడిసికొట్టింది. వాహనం తీసుకున్న ఆ డ్రైవర్ ఒక్క రోజు కూడా అద్దె చెల్లించకుండా అదే రోజు ఆటోతో పరారయ్యాడు.

డ్రైవర్ మోసంతో షాక్ తిన్న బాధితుడు గత 15 రోజులుగా అతని కోసం గాలిస్తున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. పన్నెండేళ్లుగా కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న ఒక ఇంజనీర్ ఇంత అమాయకంగా ఎలా మోసపోయాడని గౌరవ్ తోమర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు, భద్రతా చర్యలు తీసుకోకుండా కేవలం ఎవరో చెబితే నమ్మి వాహనాన్ని అప్పగించడం వల్ల భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఈ ఘటన హెచ్చరిస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా చేసే వ్యాపారాలు ఇలాంటి అనూహ్య పరిణామాలకు దారితీస్తాయని ఈ ఉదంతం నిరూపించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"ஐயப்பப் பக்தர்களின் உணர்வுகளை மதித்து, விருப்பங்களை நிறைவேற்றுவோம்" – கேரள தேவஸ்வம் அமைச்சர் உறுதி

கன்னியாகுமரி மாவட்டம் நாகர்கோவிலை அடுத்த சுசீந்திரம் ஆஸ்ரமத்தில் அகில பாரத ஐயப்பா...

നേഹ ബോറക്കെതിരെ വിദ്വേഷ പരാമര്‍ശവുമായി ആര്‍.എസ്.എസ് അനുകൂലിയായ ‘പണ്ഡിതന്‍’

ന്യൂദല്‍ഹി: ഐസ നേതാവ് നേഹ ബോറക്കെതിരെ വിദ്വേഷ പരാമര്‍ശങ്ങളുമായി ആര്‍.എസ്.എസ് അനുകൂല...