2
October, 2026

A News 365Times Venture

2
Friday
October, 2026

A News 365Times Venture

Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..

Date:

Smit Machchhar:  ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్, పైలట్‌ స్మిత్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. ఈ దాడిని అడ్డుకుని ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా స్మిత్ కీలక పాత్ర పోషించారు.

గుజరాత్ నివాసి అయిన స్మిత్ మచ్చర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ‘‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’’ అందచేయనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్‌కు రూ. 25 లక్షల నగదు పురస్కారం కూడా ప్రకటించారు. 180 మంది ప్రాణాలు కాపాడారని సీఎం ప్రశంసించారు. రక్తమోడుతున్నా  ప్రయాణికుల భద్రత కోసం చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమని అన్నారు. గుజరాత్‌తో పాటు దేశానికి గుర్వకారణంగా నిలిచారని అన్నారు.

మరోవైపు, స్మిత్ త్వరగా కోలుకోవాలని సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ మంత్ర జపం నిర్వహించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గుజరాత్ మూలాలు ఉన్న స్మిత్ మచ్చర్, చాలా కాలం క్రితమే ముంబైకి మారారు. ప్రస్తుతం ఆయనను మెరుగైన వైద్య సహాయం కోసం సౌదీ నుంచి అబుదాబీ తరలించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Flydubai-ல் இந்திய விமானிக்கு கத்திக்குத்து; ஈரானுக்குத் தொடர்பா? – ட்ரம்ப், நெதன்யாகு பதில் என்ன?

துபாயிலிருந்து இஸ்ரேலின் டெல் அவிவ் சென்ற விமானத்தில் விமானியைச் சக விமானி...

ಫಾರ್ಮ್‌ 7 ದುರ್ಬಳಕೆ ಆರೋಪ: ಚು.ಆಯೋಗದ ಮುಂದೆಯೇ ಧರಣಿ ಕುಳಿತ ಸಿಎಂ ಮತ್ತು ಸಚಿವರು

ಬೆಂಗಳೂರು,ಅಕ್ಟೋಬರ್‌,1,2026 (www.justkannada.in) ಎಸ್‌ ಐಆರ್‌ ನೆಪದಲ್ಲಿ ಮತಗಳವು, ಫಾರ್ಮ್7‌ ದುರ್ಬಳಕೆ...

ഭരണകൂട ഭീകരതയെ നേരിടണം; ഇസ്രഈലിനും യു.എസിനുമെതിരെ എസ്.സി.ഒ രാജ്യങ്ങളുടെ ഇടപെടല്‍ ആവശ്യപ്പെട്ട് ഇറാന്‍

മോസ്‌കോ: ഇസ്രഈലും യു.എസും നടത്തുന്ന കുറ്റകൃത്യങ്ങള്‍ക്കെതിരെ ഷാങ്ഹായ് കോപറേഷന്‍ ഓര്‍ഗനൈസേഷന്‍ (എസ്.സി.ഒ)...