9
September, 2026

A News 365Times Venture

9
Wednesday
September, 2026

A News 365Times Venture

Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..

Date:

అండర్-19 మహిళా టీ-20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫైయర్ ఫైనల్‌లో నైజీరియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో జింబాబ్వేపై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి, వచ్చే ఏడాది జరగనున్న ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఈ లీగ్ మొత్తంలో నైజీరియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తన ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం విశేషం. దార్ ఎస్ సలామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నైజీరియా కేవలం 98 పరుగుల స్వల్ప స్కోరు మాత్రమే చేసినప్పటికీ, దానిని విజయవంతంగా కాపాడుకోగలిగింది. ఈ గెలుపుతో వచ్చే ఏడాది బంగ్లాదేశ్, నేపాల్‌లలో సంయుక్తంగా జరగనున్న ప్రపంచకప్‌కు ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా తర్వాత అర్హత సాధించిన రెండో జట్టుగా నైజీరియా చరిత్ర సృష్టించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నైజీరియా జట్టులో 17 ఏళ్ల కెప్టెన్ క్రిస్టాబెల్ చుక్వుఓన్యే ఆరో స్థానంలో వచ్చి 21 పరుగులు చేసి జట్టు స్కోరును 6 వికెట్లకు 98 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను నైజీరియా బౌలర్ ఉసేన్ పీస్ ఆరంభంలోనే దెబ్బతీసింది. జింబాబ్వే టాప్ ఆర్డర్‌ను కూల్చివేసి ప్రత్యర్థి కోలుకోకుండా చేసింది. మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో మరో బంతి మిగిలి ఉండగానే జింబాబ్వేను 94 పరుగులకే ఆలౌట్ చేశారు. చారిత్రాత్మక విజయం తర్వాత నైజీరియా కెప్టెన్ క్రిస్టాబెల్ ఆనందబాష్పాలు రాల్చింది. ఒత్తిడిలోనూ జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది సమష్టిగా పోరాడి ఈ ట్రోఫీని అందించారని ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

నైజీరియా అండర్-19 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం ఇది రెండోసారి. 2025లో కూడా నైజీరియా టోర్నీకి అర్హత సాధించి, వర్షంతో ప్రభావితమైన మ్యాచ్‌లో 65 పరుగులను కాపాడుకుంటూ బలమైన న్యూజిలాండ్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఆ విజయాల పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడు క్రికెట్ ప్రయాణంలో మరో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఈ గెలుపుతో రీజినల్ క్వాలిఫికేషన్ ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అమెరికా, సమోవా, యూఏఈ సరసన నైజీరియా చేరింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి...

ರೈತರ ವಿಮೆ ಹಣ ಕಟ್ಟದ, ಸೊಸೈಟಿ ಕಾರ್ಯದರ್ಶಿ ವಜಾಕ್ಕೆ ಸಿಎಂ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು, ಸೆಪ್ಟಂಬರ್, 08,2026 (www.justkannada.in): ಬೆಳಗಾವಿಯ ಜೇವರ್ಗಿ ತಾಲ್ಲೂಕಿನ ಇಟ್ಟನಹಳ್ಳಿ...

വംശീയ ഉന്മൂലനം ചൂണ്ടിക്കാട്ടിയതിനും അനധികൃത കുടിയേറ്റങ്ങള്‍ക്കെതിരായ ഉപരോധത്തിനും ബ്രിട്ടനെതിരെ പ്രതികാര നടപടികളുമായി ഇസ്രഈല്‍

ലണ്ടന്‍: വെസ്റ്റ് ബാങ്കിലെ അനധികൃത ഇസ്രഈല്‍ കുടിയേറ്റ കേന്ദ്രങ്ങളുമായുള്ള എല്ലാ വ്യാപാരങ്ങള്‍ക്കുമെതിരെ...

முதல் நாளிலேயே களமிறங்கிய திமுக : இடைத்தேர்தலுக்கான வேட்பாளர்கள் யார் யார்?

தமிழகத்தில் 7 சட்டமன்றத் தொகுதிகள் காலியாக இருக்கும் நிலையில் மதுராந்தகம், தாராபுரம்...