6
September, 2026

A News 365Times Venture

6
Sunday
September, 2026

A News 365Times Venture

Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం

Date:

Pretorius Breaks T20 Record: దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. నమీబియాతో శుక్రవారం (సెప్టెంబర్ 4) జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే 101 పరుగులు చేసి అదరగొట్టాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 190.57 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ప్రిటోరియస్‌కు ఇదే తొలి టీ20 అంతర్జాతీయ శతకం. ఈ శతకంతో ప్రిటోరియస్ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. పూర్తిస్థాయి జట్టు తరఫున టీ20 అంతర్జాతీయ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉండేది. జజాయ్ 2019లో ఐర్లాండ్‌పై 20 ఏళ్ల 337 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ప్రిటోరియస్ 20 ఏళ్ల 161 రోజులకే ఈ ఘనత అందుకున్నాడు.

వైభవ్‌తో ఆసక్తికర పోలిక
ప్రిటోరియస్ ఇన్నింగ్స్‌ను భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పోలుస్తున్నారు. వీరిద్దరి మధ్య మరో ఆసక్తికరమైన సంబంధం ఉంది. ఇద్దరూ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నారు. 15 ఏళ్ల వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో పలు రికార్డులు సృష్టించాడు. భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. ఇక, వైభవ్ సూర్యవంశీ కూడా అంతర్జాతీయ టీ20 శతకం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. జింబాబ్వేపై 49 బంతుల్లో 81 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సెంచరీని అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ ఘనతపై వైభవ్ కన్నేశాడు. రాబోయే ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్, ఆసియా క్రీడలు అతనికి తన ప్రతిభను నిరూపించుకునే కీలక అవకాశాలుగా మారనున్నాయి.

దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. ప్రిటోరియస్, కోనార్ ఎస్టర్‌హుజెన్ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఎస్టర్‌హుజెన్ కూడా 88 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా పోరును ఉత్కంఠభరితంగా మార్చింది. జాన్ ఫ్రైలింక్ 72, లారెన్ స్టీన్‌క్యాంప్ 61 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే చివర్లో దక్షిణాఫ్రికా బౌలర్లు పుంజుకోవడంతో నమీబియా 20 ఓవర్లలో 217 పరుగులకే పరిమితమైంది. దీంతో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ట్రై-సిరీస్ ఫైనల్ ఆదివారం దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య జరగనుంది. ప్రిటోరియస్ మెరుపు శతకంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు సిద్ధమవుతోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സ്വതന്ത്ര ഭരദ്വാജിന്റെ അറസ്റ്റിന് പിന്നാലെ ഹിന്ദു ദൈവങ്ങളെ അധിക്ഷേപിച്ചെന്നാരോപിച്ച് നിഷു ആസാദിനും പിതാവിനുമെതിരെ പരാതി

ന്യൂദല്‍ഹി: ഹിന്ദുത്വ ഇന്‍ഫ്‌ലുവന്‍സര്‍ സ്വതന്ത്ര ഭരദ്വാജിന്റെ അറസ്റ്റിന് പിന്നാലെ സോഷ്യല്‍ മീഡിയയിലൂടെ...

"தோல்வியடைந்த ஒரு சமூகம் எப்படியிருக்கும்?" – செக்கோவ்வின் வரிகளை நினைவூட்டிய சிந்தனைச் செல்வன்

2026 சட்டமன்றத் தேர்தலில் திமுக கூட்டணியில் இடம்பெற்ற விசிக, தேர்தலுக்குப்...

Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ...

ಮಾಸಾಶನ ವೃದ್ಧಾಪ್ಯ ವೇತನ ನೀಡುತ್ತಿಲ್ಲ: ಬಡವರಿಂದ ಸರ್ಕಾರ ದೂರ ಸಾಗುತ್ತಿದೆ- ಬಿವೈ ವಿಜಯೇಂದ್ರ

ರಾಯಚೂರು,ಸೆಪ್ಟಂಬರ್,4,2026 (www.justkannada.in):  ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ನೇತೃತ್ವದ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಬಡವರಿಂದ...