19
October, 2026

A News 365Times Venture

19
Monday
October, 2026

A News 365Times Venture

Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!

Date:

Se*xual Assault: తుక్కుగూడలో నర్సు శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా ఉన్న సమయంలో శిరీషపై లైంగిక దాడికి ప్రయత్నించి, అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి బిహార్‌కు చెందిన కార్ల మెకానిక్‌ మహ్మద్‌ సనావుల్లా (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల శిరీష సుమారు ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రి ఆవరణలో ఉన్న హాస్టల్‌లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ సందర్భంగా రూమ్‌మేట్స్‌ స్వగ్రామాలకు వెళ్లడంతో శుక్రవారం రాత్రి శిరీష తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు శిరీష గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో పహాడీషరీఫ్‌ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా లైంగిక దాడి, హత్య కోణంలో విచారణ చేపట్టారు.

చివరకు ఆస్పత్రి సమీపంలోని కార్ల మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న సనావుల్లా ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇతర కార్మికులు వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడని, కొంతకాలంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుల కదలికలను గమనించినట్లు దర్యాప్తులో తేలింది. శిరీష ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన సనావుల్లా.. అర్ధరాత్రి హాస్టల్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. శిరీష ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్‌ లేకపోవడంతో అదే మార్గం ద్వారా లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. లైంగిక దాడికి ప్రయత్నించగా శిరీష ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ ఘటనలో సనావుల్లా ఒక్కడే ఉన్నాడా? మరెవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక అందిన తర్వాత కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నిందితుడు ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తైన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അവരുടെ മാപ്പ് അംഗീകരിക്കുന്നില്ല; അപകീര്‍ത്തികരമായ വാര്‍ത്ത നല്‍കിയ എ.ബി.പിക്കെതിരെ നിയമ നടപടി സ്വീകരിക്കുമെന്ന് നേഹ സിങ് റാത്തോഡ്

ന്യൂദല്‍ഹി: ഉത്തര്‍ പ്രദേശിലെ ബി.ജെ.പി സര്‍ക്കാരിനെ വിമര്‍ശിക്കാരുള്ള ഭോജ്പൂരി നാടന്‍പാട്ട് ഗായിക...

72 குண்டுகள் முழங்க அரசு மரியாதையுடன் தேவா உடல் நல்லடக்கம்; சொந்த ஊர் மக்கள் திரண்டு வந்து அஞ்சலி!

`தேனிசைத் தென்றல்’ என்று கொண்டாடப்பட்ட இசையமைப்பாளர் தேவாவின் திடீர் மரணம் திரையுலகினர்...

Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!

Tiger Shroff Firing: బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా ఆదివారం...

നല്ല ബസ്സുകളും നല്ല ശൗചാലയവുമുണ്ടാക്കുക; കെ.എസ്.ആര്‍.ടി.സി മൂന്ന് നാല് വര്‍ഷങ്ങള്‍ക്കുള്ളില്‍ ലാഭകരമാകും: സി.എന്‍ വിജയകൃഷ്ണന്‍

കോഴിക്കോട്:നല്ല ബസ്സുകള്‍ ഇറക്കുകയും യാത്രക്കാര്‍ക്കായി ഏറ്റവും വൃത്തിയുള്ളതും ആധുനികവുമായ ശൗചാലയം ഉണ്ടാക്കുകയും...