24
August, 2026

A News 365Times Venture

24
Monday
August, 2026

A News 365Times Venture

AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్

Date:

AK-203: విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, భారత్ పూర్తిగా స్వదేశంలోనే, స్వదేశీ ముడి పదార్థాలతోనే తయారైన AK-203 రైఫిల్‌ను ఆవిష్కరించింది. దీనికి ‘షేర్’ అని పేరు పెట్టారు. ఈ రైఫిల్ ఆటోమేటిక్, బరస్ట్ ఫైరింగ్ టెస్టుల్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. 2019లో భారత్, రష్యా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా AK-203 రైఫిళ్లను భారత్‌లోనే తయారు చేసేందుకు ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఏర్పాటైంది. భారత్‌లో తయారైన రైఫిళ్లలో మొదటగా దిగుమతి చేసుకున్న కిట్‌లను ఉపయోగించగా, ఇప్పుడు దేశీయ భాగాల వాటాను పెంచారు.

తాజాగా తయారైన షేర్‌లో ప్రతీ విడిభాగం, ముడి పదార్థం భారత్‌లోనే తయారైంది. కేవలం రైఫిల్‌ను భారత్‌లో అసెంబుల్ చేయడమే కాకుండా, దాని తయారీకి అవసరమైన ప్రతీ వస్తువును భారత్‌లోనే దేశీయంగా అభివృద్ధి చేశారు. AK-203లో సుమారు 50 ప్రధాన భాగాలు, 180 ఉప భాగాలు, దాదాపు 120 తయారీ ప్రక్రియలు ఉన్నాయి. వీటన్నింటినీ భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసేందుకు IRRPL అనేక దేశీయ సరఫరాదారులను అభివృద్ధి చేసింది.

AK-203 7.62×39 మిమీ కార్ట్రిడ్జ్‌ను ఉపయోగించే గ్యాస్-ఆపరేటెడ్, మ్యాగజైన్-ఫెడ్ అసాల్ట్ రైఫిల్. ఫోల్డింగ్, అడ్జస్టబుల్ స్టాక్, ఎర్గోనామిక్ గ్రిప్, ఆధునిక ఆప్టికల్ పరికరాలను అమర్చేందుకు రైల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం భారత సైన్యం ఉపయోగిస్తున్న ఇన్సాస్ రైఫిల్‌కు దీనిని ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తున్నారు. మొత్తం 6,01,427 AK-203 రైఫిళ్లను తయారు చేసే కాంట్రాక్ట్ ఉంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.5,200 కోట్లు. ఉత్పత్తి గడువును కూడా అక్టోబర్ 2032 నుంచి డిసెంబర్ 2030కు ముందుకు తీసుకొచ్చారు. ఈ లెక్కన కోర్వా ప్లాంట్ ప్రతీ రోజు 600 రైఫిళ్లను తయారు చేయాల్సి ఉంటుంది. ప్రతీ 100 సెకన్లకు ఒక రైఫిల్ తయారు కావాలి. ఈ రైఫిళ్లలో వాడుతున్న దేశీయ వస్తువులు 2025 మధ్య నాటికి 50 శాతం ఉండగా, ఇది ఇప్పుడు 100 శాతానికి చేరుకుంది. ఈ రైఫిళ్లపై భారత సైన్యం యూజర్ ట్రయల్స్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 2026 నాటికి ఈ రైఫిళ్లను భారత సైన్యానికి అందచేసి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചതിച്ചതാര്? ചന്തു തന്നെ; തന്നെ മന്ത്രിയാക്കാമെന്ന വാഗ്ദാനം കാരണം ചിലരുടെ ഉറക്കം പോയി: പ്രവീണ്‍ കുമാറിനെതിരെ അന്‍വര്‍

കോഴിക്കോട്: ബേപ്പൂര്‍ മണ്ഡലത്തിലെ തന്റെ തോല്‍വിയുമായി ബന്ധപ്പെട്ട് കൊയിലാണ്ടി എം.എല്‍.എ അഡ്വക്കറ്റേ്...

'LED ஸ்க்ரீன், வாட்டர் பாட்டில், ஒரு நாள் அரசு டாக்டர்'- அவையில் எம்.எல்.ஏக்களின் வினோத கோரிக்கைகள்!

சட்டமன்றத்தில் மானியக் கோரிக்கை விவாதம் நடந்து வருகிறது. இந்தக் கூட்டத் தொடரில்...

ಸದನದಲ್ಲಿ ಸದ್ದು ಮಾಡಿದ ಅದಾನಿ-ಸಿಎಂ ಡಿಕೆಶಿ ಭೇಟಿ ವಿಚಾರ: ಆರ್.ಅಶೋಕ್ ವ್ಯಂಗ್ಯ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,24,2026 (www.justkannada.in):  ಉದ್ಯಮಿ ಗೌತಮ್ ಅದಾನಿ ಹಾಗೂ ಸಿಎಂ ಡಿಕೆ...

മോദി സർക്കാർ സ്വകാര്യവത്കരണത്തിന്റെ പേരിൽ ഐ.എസ്.ആർ.ഒയുടെ കഴുത്ത് ഞെരിക്കുന്നു: ജയറാം രമേശ്

ന്യൂദൽഹി: ഇന്ത്യയുടെ ബഹിരാകാശ മേഖലയെ സ്വകാര്യവത്കരിക്കാനുള്ള മോദി സർക്കാരിന്റെ തീവ്ര ശ്രമത്തിനെതിരെ...