23
August, 2026

A News 365Times Venture

23
Sunday
August, 2026

A News 365Times Venture

Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

Date:

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు గత 19 రోజులుగా కనిపించకుండాపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 3న వేటకు బయలుదేరిన ఈ బోటుతో 5వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ తెగిపోయింది. సాధారణంగా వేటకు వెళ్లినవారు తిరిగొస్తారనే నమ్మకంతో కుటుంబసభ్యులు ఈ నెల 13వ తేదీ వరకు వేచి చూశారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళనకు గురై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి బాధితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను యంత్రాంగం వేగవంతం చేసింది.

ఈ గాలింపు చర్యల్లో విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు కోస్ట్ గార్డ్ నౌకలతో పాటు రెండు నేవీ హెలికాప్టర్లు బంగాళాఖాతంలో తీవ్రంగా శోధిస్తున్నాయి. విశాఖపట్నం, చెన్నై నుంచి వచ్చిన నేవీ నౌకలు సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నాయి. కాకినాడ, విశాఖ కోస్ట్ గార్డ్ బృందాలు, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో నేడు ఐదో రోజు కూడా గాలింపు ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

మరోవైపు పోలీసులు బాధితుల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించి, వారి కాల్ డేటాను విశ్లేషిస్తూ సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, సదరు బోటులో ముందస్తు జాగ్రత్తగా VHF ట్రాన్స్‌పాండర్ పరికరాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్లే కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయి, వారి లొకేషన్‌ను గుర్తించడం కష్టతరంగా మారింది. మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వారి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ త్వరలోనే అందించనున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ആൺകുട്ടികൾ ചെയ്താൽ കുഴപ്പമില്ല, പെൺകുട്ടികൾ ചെയ്‌താൽ സംസ്ക്കാരത്തിന് ചേരാത്തത്: മോഡിക്കെതിരെ രാഹുൽ ഗാന്ധി

പൂനെ: പെൺകുട്ടികൾ അധിക്ഷേപ വാക്കുകൾ ഉപയോഗിച്ചതിനെ മാത്രം ചൂണ്ടിക്കാട്ടി പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര...

"கைப்புண்ணுக்கு கண்ணாடி எதற்கு?" – திமுக ஊழல் ஆதாரம் குறித்த கேள்விக்கு அருண்ராஜ் கிண்டல் பதில்

முழுமையாக 100 நாட்களைக் கடந்துவிட்ட த.வெ.க ஆட்சியில், தமிழக சட்டசபையில், ஆளுங்கட்சிக்கும்...

ಬಿ.ನಾಗೇಂದ್ರ ವಿರುದ್ಧ ಪ್ರಾಸಿಕ್ಯೂಷನ್‌ ಗೆ ಅನುಮತಿ ಕೋರಿ CBI ಪತ್ರ: ಗೃಹ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,22,2026 (www.justkannada.in):  ಸಚಿವ ಬಿ.ನಾಗೇಂದ್ರ ವಿರುದ್ದ ಪ್ರಾಸಿಕ್ಯೂಷನ್‌ ಗೆ ಅನುಮತಿ...

ചർച്ച പരാജയം: യു.എസിനെതിരെ പകര തീരുവ പ്രഖ്യാപിച്ച് കാനഡ

വാഷിംഗ്ടൺ: കാനഡയും അമേരിക്കയും തമ്മിലുള്ള വ്യാപാര ചർച്ചകൾ പരാജയപ്പെട്ടതിന് പിന്നാലെ അമേരിക്കൻ...