14
August, 2026

A News 365Times Venture

14
Friday
August, 2026

A News 365Times Venture

5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!

Date:

Vivo X300 FE: వివో (Vivo) ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా Vivo X300 FEను భారత్‌లో మే 6న విడుదల చేసింది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు కొత్త ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పటివరకు 12GB RAMతో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీంతో Vivo X300 FE కొత్త ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ.84,999 నుంచి ప్రారంభమవుతోంది.

కొత్త వేరియంట్ రాకకు ముందు ఉన్న 12GB + 256GB, 12GB + 512GB మోడళ్ల ధరలను కంపెనీ ఇటీవలే రూ.10,000 చొప్పున పెంచింది. మెమరీ, స్టోరేజ్ కాంపోనెంట్ల ధరల పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు జరిగినట్లు తెలుస్తోంది.

స్పెసిఫికేషన్లు:

కొత్త 8GB + 256GB వేరియంట్‌లో కూడా ఇతర మోడళ్లలో ఉన్న అదే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. ఇందులో 6.31 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1,216 × 2,640 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే 460ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు గరిష్ఠంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఫోన్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్స్ ఉన్నాయి.

Vivo X300 FEలో Qualcommకు చెందిన 3nm ఆక్టా-కోర్ Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 829 GPU ఉంది. దీనికి LPDDR5x Ultra RAM, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ సపోర్ట్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం Vivo X300 FEలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

Vivo X300 FEలో భారీ 6,500mAh బ్యాటరీ ఉంది. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 150.83 × 71.76 × 7.99 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండగా, బరువు సుమారు 191 గ్రాములు ఉంది. కొత్త 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌తో Vivo X300 FE ధర భారత్‌లో రూ.84,999 నుంచి ప్రారంభమవుతోంది. ఇది ప్రస్తుతం కొత్త బేస్ మోడల్‌గా ఉంది. 12GB + 256GB వేరియంట్ ధర ఇటీవల పెరిగిన తర్వాత రూ.89,999గా ఉంది. ఇక 12GB + 512GB టాప్-ఎండ్ మోడల్ ధర రూ.99,999గా ఉంది.

Vivo X300 FEను లిలక్ పర్పుల్, నోయిర్ బ్లాక్, అర్బన్ ఆలివ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. కొత్త 8GB + 256GB వేరియంట్ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. కొనుగోలుపై SBI, HDFC, Axis బ్యాంకు క్రెడిట్ కార్డులు, UPI లావాదేవీల ద్వారా 10% ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అలాగే 24 నెలల వరకు నో-కాస్ట్ EMI లేదా 10% అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വിവാദ ഉത്തരവില്‍ യൂ ടേണ്‍ അടിച്ച് ബി.സി.ഐ: ചീഫ് ജസ്റ്റിനെതിരെ പ്രതിഷേധിച്ച വിദ്യാര്‍ത്ഥികള്‍ക്ക് എന്റോള്‍ ചെയ്യാം

ന്യൂദല്‍ഹി: ഹൈദരാബാദിലെ നല്‍സാര്‍ നിയമ സര്‍വകലാശാലയിലെ 2026 ബിരുദധാരികളെ അഭിഭാഷകരായി എന്‍...

'எங்களை விட்டுருங்க' – 3 பில்லியன் டாலர், 2 டன் தங்கத்தை வழங்கி ஈரானைச் சமானப்படுத்திய UAE

இஸ்ரேலும், அமெரிக்காவும் இணைந்து கடந்த பிப்ரவரியில் இருந்து ஈரான் மீது தாக்குதல்...

காவிரி விவகாரம்: பிசுபிசுத்த கன்னட அமைப்பினரின் போராட்டம் – ஆதரவு கொடுக்காத கர்நாடக மக்கள்!

மேகதாது அணை கட்டவும், காவிரியில் தமிழகத்துக்கு நீரை திறக்கக் கூடாது என்பதை...