30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

Date:

India vs Sri Lanka Test Series: టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27పై దృష్టి సారించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. WTC పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సిరీస్ భారత్‌కు ఎంతో కీలకం. గత WTC సైకిల్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయిన టీమిండియా.. ప్రస్తుతం మిగిలి ఉన్న ప్రతి టెస్ట్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీలంక పరిస్థితులు, ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు భారత బ్యాటర్లకు, బౌలర్లకు సవాలుగా మారనున్నాయి.

భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.

WTC పాయింట్ల పట్టిక:

భారత్, శ్రీలంక మధ్య జరగనున్న ఈ రెండు టెస్టులు WTC 2025-27 సైకిల్‌లో భాగం. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారీ ప్రయోజనం లభిస్తుంది. గత కొంతకాలంగా విదేశీ పర్యటనల్లో భారత జట్టు ప్రదర్శనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. శ్రీలంక సిరీస్‌లో విజయాలు సాధించడం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది. ఇక గాల్, కొలంబోలోని పిచ్‌లు సాధారణంగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. దీంతో ఇరు జట్ల స్పిన్నర్లకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. మ్యాచ్‌లు సాగుతున్న కొద్దీ పిచ్ స్వభావం మారే అవకాశం ఉంది.

లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

భారత్‌లో శ్రీలంకతో జరిగే ఈ టెస్ట్ సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಾಧೀಶರ ವರ್ಗಾವಣೆ: ಮೈಸೂರಿಗೆ ಬಿ. ಜಯಂತ ಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು, ಸೆಪ್ಟಂಬರ್,29, 2026 (www.justkannada.in):  ಕರ್ನಾಟಕ ಹೈಕೋರ್ಟ್ ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಾಧೀಶರ...

നാല് മാസത്തിനുള്ളില്‍ യു.ഡി.എഫ് നേടിയ പിന്തുണ തകര്‍ന്നു; ഉപ തെരഞ്ഞെടുപ്പ് ഫലം സര്‍ക്കാരിന് ജനം നല്‍കിയ താക്കീതെന്ന് പിണറായി

തിരുവനന്തപുരം: അധികാരത്തിലെത്തി വെറും നാലുമാസത്തിനുള്ളില്‍ തന്നെ പൊതുതെരഞ്ഞെടുപ്പില്‍ യു.ഡി.എഫ് നേടിയ പിന്തുണ...

சபரிமலை: கடைகளுக்கான இ-டெண்டரைச் சீர்குலைக்க தேவஸ்வம் ஊழியர்கள் சதி; கோபமான அமைச்சர்; பின்னணி என்ன?

சபரிமலை ஐயப்ப சுவாமி கோயிலில் நடைதிறப்பு மற்றும் மண்டல-மகரவிளக்கு யாத்திரை காலங்களில்...

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ సీజన్‌-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్‌, సరస్‌ మేళాకు భారీ ఏర్పాట్లు

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ నగర కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు...