12
August, 2026

A News 365Times Venture

12
Wednesday
August, 2026

A News 365Times Venture

CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!

Date:

CM Revanth: తెలంగాణలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన స్ ప్లాట్ఫామ్ వేదికగా ఆయన.. భవనాలు నిర్మించడం సులభమేనని, అయితే విద్యార్థుల కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలని అన్నారు. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా.. ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలకడంతో పాటు కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం వంటి భేదాలను తొలగించి ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విద్యాలయాలు పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని పేర్కొన్నారు.

ఈ పాఠశాలలు పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలు, పరిపాలకులు, పారిశ్రామికవేత్తలు, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేద పిల్లల కలలకు చిరునామాగా, తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. ఈ పాఠశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలుగా కాకుండా, తరతరాల భవిష్యత్తును మార్చే సంస్థలుగా రూపుదిద్దుకుంటాయని రేవంత్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಾಳಿನ ಬಂದ್ ನಿಂದ ಪ್ರಯೋಜನವಿಲ್ಲ: ತೊಂದರೆ ಆಗದಂತೆ ಕ್ರಮ- ಗೃಹ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,12,2026 (www.justkannada.in):  ತಮಿಳುನಾಡಿಗೆ ನೀರು ಹರಿಸುವಂತೆ ಕಾವೇರಿ ನೀರು ನಿರ್ವಹಣಾ...

‘മാതൃരാജ്യം വില്‍പ്പനയ്ക്കുള്ളതല്ല’; സ്വകാര്യ സ്വത്ത് ബില്ലിനെതിരെ അര്‍ജന്റീനന്‍ തെരുവിലിറങ്ങി ആയിരങ്ങള്‍; പ്രതിഷേധം ശക്തമാക്കി ഇടത് സംഘടനകള്‍

ബ്യൂണസ് അയേഴ്‌സ്: അര്‍ജന്റീനയിലെ പ്രസിഡന്റ് ജാവിയര്‍ മിലെയുടെ സര്‍ക്കാര്‍ മുന്നോട്ടുവെച്ച സ്വകാര്യ...

‘சுத்தமான பெட்ரோல் உங்கள் அப்பா வீட்டிலிருந்தா வரும்?’ – E20 விவகாரத்தில் பாஜக எம்.பி சர்ச்சை பேச்சு

இந்தியாவில் E20 பெட்ரோல் அறிமுகப்படுத்தியதில் இருந்து எதிர்ப்புகளும், கண்டனங்களும் எழுந்துகொண்டே இருக்கின்றன....

YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు

YS Jagan Slams AP PPP Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన...