5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)

Date:

Ravindra Jadeja: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియా కోచ్ గంభీర్‌ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ తరుణంలో ఎట్టకేలకు గంభీర్ ముఖంలో చిరునవ్వు తెప్పించాడు జడేజా. కొలంబో వేదికగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్ (SLC XI) తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, తన సహచర స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చం అలాగే దింపేస్తూ నవ్వులు పూయించాడు. కుల్దీప్ రన్-అప్ వచ్చేటప్పుడు ముఖంలో పెట్టే ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా జడేజా ఇమిటేట్ చేయడంతో కామెంట్స్ బాక్స్‌తో పాటు డగౌట్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. కామెంటేటర్లు సైతం జడేజా టైమింగ్, ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ను చూసి మైమరిచిపోయారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే… రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గాయం వల్ల సిరీస్ నుంచి తప్పుకున్న సాయి సుదర్శన్ స్థానంలో మూడో నంబర్‌లో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్, తన స్టైలిష్ సెంచరీతో (142 నాటౌట్) అదరగొట్టి తొలి టెస్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. పడిక్కల్ ఇన్నింగ్స్‌లో 18 కళాత్మక ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ‘నటరాజ షాట్’ తో పాటు వేగవంతమైన కట్ షాట్లు, పుల్ షాట్లతో శ్రీలంక బౌలర్లను ఆడుకున్నాడు.

రెండో రోజు రెండో బంతి కే ప్యాట్రిక్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) పరుగులేమీ చేయకుండా అవుట్ అయినప్పటికీ.. కేఎల్ రాహుల్ (40)తో కలిసి పడిక్కల్ రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజాతో కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు మళ్లించాడు. 121 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్, ఆ తర్వాత రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. చివర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి మరో నాలుగు ఫోర్లు బాదాడు. మరోవైపు, సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ అవుట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో విదేశీ పిచ్‌లపై మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తన విలువ ఏంటో మరోసారి నిరూపించాడు. తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చిన మానవ్ సుతార్ (41) కూడా జడేజాతో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆకట్టుకున్నాడు.

అయితే, వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ధృవ్ జురెల్ ల వైఫల్యం జట్టును కొంత నిరాశపరిచింది. బెంచ్ పై ఉన్న పరిస్థితులను వాడుకోవడంలో పంత్ (2) తీవ్రంగా విఫలమయ్యాడు. ఆఫ్ స్పిన్నర్ రమేష్ మెండిస్ (2/77) బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత కూడా ఆఫ్ స్పిన్ ఎదుర్కొవడంలో తన టెక్నికల్ లోపాలను సరిదిద్దుకోలేకపోయిన ధృవ్ జురెల్ (1) ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి చౌకగా వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి సారాంశ జైన్ (22 రిటైర్డ్ అవుట్) రాణించగా, పడిక్కల్ క్రీజులోనే ఉన్నాడు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಚು. ಆಯೋಗದ ಮುಂದೆ ಧರಣಿ ಮಾಡಿಲ್ಲ: ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ನನ್ನ ಮೇಲೆ ಕೇಸ್ ಹಾಕಲಿ- ಸಿಎಂ ಡಿಕೆಶಿ

ಮೈಸೂರು,ಅಕ್ಟೋಬರ್,3,2026 (www.justkannada.in): ನಾನು ಚುನಾವಣಾ ಆಯುಕ್ತರ ಮುಂದೆ ಧರಣಿ ಮಾಡಿಲ್ಲ....

മറ്റ് സമുദായങ്ങളുടെ ജനസംഖ്യ കൂടി; ഹിന്ദുക്കള്‍ നേരത്തെ കല്യണം കഴിച്ച് അഞ്ച് കുട്ടികളെയുണ്ടാക്കണം: ബി.ജെ.പി എം.പി

ഭോപ്പാല്‍: ഹിന്ദുക്കള്‍ നേരത്തെ കല്യാണം കഴിക്കണമെന്നും അഞ്ച് കുട്ടികളെ വീതം ഉണ്ടാക്കണമെന്നും...

By Election: `டாஸ்மாக் மூடல், வெளியூர் நபர்கள் வெளியேற உத்தரவு!'- தேர்தல் ஆணையம் சொல்வது என்ன?

தமிழ்நாட்டில் மதுராந்தகம் மற்றும் தாராபுரம் ஆகிய இரண்டு தனி தொகுதிகளுக்கான இடைத்தேர்தல்...

Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?

ఒకప్పుడు స్నీకర్లను కేవలం క్రీడలకు లేదా సాధారణ అవసరాల కోసం ధరించే...