16
July, 2026

A News 365Times Venture

16
Thursday
July, 2026

A News 365Times Venture

Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..

Date:

Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రెహాన్ బాధితురాలి ఇంటి సమీపంలో పండ్లు విక్రయిస్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై కన్నేసిన నిందితుడు.. గత మే నెలలో ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భయపడిన బాలిక నెలల తరబడి ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.

అయితే ఇటీవల నిందితుడు మరోసారి వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో భయాందోళనకు గురైన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వెల్లడించింది. వెంటనే వారు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడు రెహాన్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്ലീഡര്‍ നിയമന വിവാദം: കെ.എസ്.യു പ്രസിഡന്റിന് മുഖം നല്‍കാതെ മുഖ്യമന്ത്രി: കൂടിക്കാഴ്ചയ്ക്ക് അനുമതി നിഷേധിച്ചു

തിരുവനന്തപുരം: ഗവണ്‍മെന്റ് പ്ലീഡര്‍ നിയമന വിവാദത്തില്‍ കെ.എസ്.യു സംസ്ഥാന പ്രസിഡന്റ് അലോഷ്യസ്...

"என் ​உடலை ஜூம் செய்து போட்டோ எடுத்து வலைதளத்தில் பகிர்ந்தனர்"- கேரள பெண் அமைச்சர் அதிர்ச்சித் தகவல்

கேரள மாநில மகளிர் மற்றும் குழந்தைகள் நலத்துறை அமைச்சர் பிந்து கிருஷ்ணா...

ನಾಲ್ವರು ಡ್ರಗ್ಸ್ ಪೆಡ್ಲರ್ ಗಳ ಬಂಧನ:  34 ಕೋಟಿ ರೂ. ಮೌಲ್ಯದ ಡ್ರಗ್ಸ್ ವಶಕ್ಕೆ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,15,2026 (www.justkannada.in):  ನಾಲ್ವರು ಡ್ರಗ್ಸ್ ಪೆಡ್ಲರ್ ಗಳನ್ನ ಬಂಧಿಸಿರುವ ಬೆಂಗಳೂರಿನ...

യു.എസ് സൈനികരുടെ മൊബൈല്‍ ഫോണ്‍ വിവരങ്ങള്‍ ഇറാന്‍ ചോര്‍ത്തിയതായി വെളിപ്പെടുത്തല്‍

ന്യൂയോര്‍ക്ക്: യു.എസ് സൈനികോദ്യോഗസ്ഥരെ ലക്ഷ്യമിട്ട് ഇറാന്റെ സൈബര്‍ ആക്രമണം നടന്നതായി ഗവേഷണ...