21
June, 2026

A News 365Times Venture

21
Sunday
June, 2026

A News 365Times Venture

Cockroach Janta Party: జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. అరెస్ట్‌కు సిద్ధమన్న అభిజిత్ దీప్కే.

Date:

Cockroach Janta Party:  ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే, తమ నిరసన టైమ్ పొడగించాలని సీజేపీ డిమాండ్‌ను పోలీసులు తిరస్కరించారు. దీంతో నిరసనకారుల్ని పోలీసులు ఆ ప్రదేశం నుంచి శాంతియుతంగా తొలగించడంతో ఉద్రిక్తత మొదలైంది. సాయంత్రం 6 గంటలకు కూడా మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరాలని సీజేపీ పిలుపునిచ్చింది. అయితే, ఢిల్లీ పోలీసులు మాత్రం గడవు ముగిసిందని, నిరసనకారులు ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.

జంతర్ మంతర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఎస్ఎఫ్ఐకి చెందిన పలువురు విద్యార్థి నాయకులు ఇంకా వేదికపైనే ఉన్నారు. దీనికి ముందు జనాలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన దీప్కే.. శాంతియుత నిరసనకు అనుమతి పొడగించాలని ఢిల్లీ పోలీసుల్ని కోరారు. ‘‘ చర్చలకు మేం సిద్ధం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలనేది మా డిమాండ్. బలవంతంగా మమ్మల్ని తొలగించడానికి పోలీసులు అరెస్ట్‌లు చేస్తే, అరెస్ట్ అయ్యే వారిలో నేనే మొదటి వ్యక్తిని అవుతానున’’ అని దీప్కే అన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Heavy Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర...

ನಮ್ಮಲ್ಲಿ 16 ಟಿಎಂಸಿ ಮಾತ್ರ ನೀರಿದೆ: ತಮಿಳುನಾಡಿಗೆ ನಿಗದಿಯಷ್ಟು ಕೊಡೋಣ- ಸಚಿವ ರಾಮಲಿಂಗರೆಡ್ಡಿ

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,20,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಈ ಬಾರಿ ಮುಂಗಾರು ಮಳೆ ನಿರೀಕ್ಷಿತ...

ലെബനനിലെ ഇസ്രഈല്‍ ആക്രമണം: ഹോര്‍മുസ് വീണ്ടും അടച്ച് ഇറാന്‍

ബെയ്‌റൂട്ട്: വെടിനിര്‍ത്തല്‍ പ്രഖ്യാപിച്ചിട്ടും ലബനനില്‍ ഇസ്രഈല്‍ ആക്രമണം നടത്തുന്നതിനാല്‍ ഹോര്‍മുസ് കടലിടുക്ക്...

“திமுக-வின் பகையாளி பாஜக மட்டுமே; அதிமுக எங்களின் பங்காளி" – ஆர்.எஸ். பாரதி அதிரடிப் பேட்டி!

சட்டமன்றத் தேர்தல் முடிவுகளுக்குப் பிறகு தமிழ்நாட்டின் அரசியல் களம் பல்வேறு மாற்றங்களை...