20
June, 2026

A News 365Times Venture

20
Saturday
June, 2026

A News 365Times Venture

Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Date:

Papaya Seeds Health Benefits: బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండుగా పేరుగాంచింది. అయితే బొప్పాయి తిన్న తర్వాత చాలా మంది దాని గింజలను పనికిరావని భావించి చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం బొప్పాయి గింజలు కూడా అనేక పోషక గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బొప్పాయి గింజల్లో పీచు పదార్థం, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో మరియు శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

* బొప్పాయి గింజలను ఉపయోగించాలంటే ముందుగా వాటిని పండులో నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. అనంతరం ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత అవి నల్ల మిరియాల్లా కనిపిస్తాయి. వాటిని పొడిలా చేసి సూప్‌లు, సలాడ్లు, పాస్తా వంటి ఆహారాల్లో మసాలా రూపంలో ఉపయోగించవచ్చు.

* బరువు తగ్గాలని భావించే వారికి కూడా బొప్పాయి గింజలు ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. 4 నుంచి 5 ఎండిన గింజలను మెత్తగా నూరి గోరువెచ్చని నీటిలో కలిపి, అందులో అర నిమ్మరసం మరియు ఒక టీస్పూన్ తేనె వేసి ఉదయాన్నే తీసుకుంటే జీవక్రియ మెరుగుపడటానికి తోడ్పడుతుందని అంటున్నారు.

* అలాగే ఫ్రూట్ స్మూతీలు, గ్రీన్ జ్యూస్‌లు లేదా షేక్‌లలో కొద్దిపాటి బొప్పాయి గింజలను కలిపి తీసుకోవచ్చు. ఇవి పానీయానికి ప్రత్యేక రుచిని అందించడంతో పాటు అదనపు పోషకాలను కూడా అందిస్తాయి.

* తరచుగా అజీర్ణం లేదా కడుపు సమస్యలతో బాధపడేవారు 4 నుంచి 5 తాజా బొప్పాయి గింజలను ఒక టీస్పూన్ తేనెతో కలిపి తీసుకోవచ్చని కొందరు సూచిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కడుపు ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.

అయితే బొప్పాయి గింజలను అధిక మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది. అందువల్ల వాటిని ఆహారంలో చేర్చే ముందు తప్పనిసరిగా వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!

Monsoon 2026: దేశవ్యాప్తంగా దాదాపు రెండు వారాలుగా నత్తనడకన సాగుతూ, తీవ్ర...

ನಗರಾಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಧಿಕಾರಗಳು ಕಡ್ಡಾಯವಾಗಿ ಪ್ರತಿ ತಿಂಗಳು ಸಭೆ ನಡೆಸಬೇಕು- ಸಚಿವ ಡಾ. ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,19,2026 (www.justkannada.in): ನಗರಾಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಧಿಕಾರಗಳು ಕಾಲ ಕಾಲಕ್ಕೆ ಪ್ರಾಧಿಕಾರದ ಸಭೆ...

ആരോഗ്യ ഇന്‍ഷൂറന്‍സിന് വേണ്ടത് 7500 കോടി; വകയിരുത്തിയത് 10 കോടി മാത്രം: തോമസ് ഐസക്

തിരുവനന്തപുരം:യു.ഡി.എഫ് സര്‍ക്കാരിന്റെ ആദ്യ ബജറ്റിനെതിരെ വിമര്‍ശനവുമായി മുന്‍ ധനമന്ത്രിയും സി.പി.ഐ.എം നേതാവുമായ...

குறுக்கே நிற்கும் இஸ்ரேல்: தள்ளிப்போகும் அமெரிக்கா, ஈரான் பேச்சுவார்த்தை

நேற்று முன்தினம் (ஜூன் 17), அமெரிக்கா, ஈரான் இடையே 14 புள்ளிகள்...