12
June, 2026

A News 365Times Venture

12
Friday
June, 2026

A News 365Times Venture

Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Date:

పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. గతేడాది జూన్ 12న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసి అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 28న సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసి ఖమేనీ సహా కీలక నేతలందరినీ హతం చేశాయి. అనంతరం ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా తిరిగి మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇరాన్-అమెరికా పరస్పరం కవ్వించుకుంటున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికి భీకర దాడులుంటాయని వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పుడు ట్రంప్‌నకు కౌంటర్‌గా ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా తీసుకునే ఏ కొత్త చర్యకైనా మరింత బలమైన, బాధాకరమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. టెహ్రాన్‌పై అమెరికా మరిన్ని సైనిక చర్యలు చేపడితే.. బాధాకరమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ చట్టసభ సభ్యుడు హెచ్చరించారు. వాషింగ్టన్ నుంచి ఎలాంటి కొత్త దురాక్రమణ జరిగినా దానికి గట్టిగా ప్రతీకారం తీర్చుకోవడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ పార్లమెంటరీ జాతీయ భద్రతా కమిటీ అధిపతి హెచ్చరించారు. ఒత్తిడికి లొంగబోమనే టెహ్రాన్ వైఖరిని నొక్కిచెప్పారు. కొనసాగుతున్న సంఘర్షణలో ట్రంప్ చివరికి లొంగిపోవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ మాట్లాడుతూ… లొంగిపోవాల్సింది ఇరాన్ కాదు.. అమెరికాయే అని అన్నారు. ఈ పోరాటంలో నిస్సందేహంగా అమెరికాయే లొంగిపోవాలన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಕ್ರಮ ಗಣಿಗಾರಿಕೆ ಪ್ರಕರಣ: ಉಪ ಲೋಕಾಯುಕ್ತರ ಹಸ್ತಕ್ಷೇಪದಿಂದ ಮೃತ ಚಾಲಕನ ಪತ್ನಿಗೆ ₹30 ಲಕ್ಷ ಪರಿಹಾರ

ಮಂಡ್ಯ,ಜೂನ್,11,2026 (www.justkannada.in): ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆ ನಾಗಮಂಗಲ ತಾಲೂಕಿನ ಅಕ್ರಮ ಗಣಿಗಾರಿಕೆ...

നിപ: പൂനെയിലെ പരിശോധനാ ഫലവും പോസിറ്റീവ്; റൂട്ട് മാപ്പ് പുറത്തുവിടും

കോഴിക്കോട്: മെഡിക്കല്‍ കോളേജില്‍ ചികിത്സയില്‍ കഴിയുന്ന ഫാറൂഖ് കോളജ് സ്വദേശിയായ യുവാവിന്...

நிதி ஆயோக் கூட்டம்: `ஆக்கப்பூர்வ ஒத்துழைப்பு டு நீட் எதிர்ப்பு…' – முதல்வர் விஜய் பேசியது என்ன?

நிதி ஆயோக் கவுன்சிலின் 11-வது கூட்டம் டெல்லி ஜனாதிபதி மாளிகை வளாகத்தில்...