13
June, 2026

A News 365Times Venture

13
Saturday
June, 2026

A News 365Times Venture

Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!

Date:

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులు గడుస్తున్నా పరిస్థితులు చక్కబడలేదు. ఇప్పటికే అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంతో పాటు హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. వాస్తవానికి మొదట కొద్ది రోజుల్లోనే యుద్ధం ముగిసిపోతుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు.

హార్ముజ్ జలసంధి మూసేసి దాదాపు 100 రోజులైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆయా దేశాలు అల్లాడిపోతున్నాయి. హార్ముజ్ దిగ్బంధం ఇంకా కొనసాగితే మాత్రం ప్రపంచ దేశాలు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య ఇంకా శాంతి ఒప్పందం జరగలేదు. యురేనియం దగ్గర పంచాయితీ తెగడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర అణు బాంబ్ ఉండటానికి వీల్లేదని అమెరికా అంటోంది. అందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందం జరగడం లేదు.

ఇంకోవైపు పాకిస్థాన్ మధ్యవర్తిగా శాంతి ఒప్పందానికి ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఒకవేళ యుద్ధం గనుక ఇలానే కొనసాగితే మాత్రం ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.പിയില്‍ എട്ട് ദിവസം വയലില്‍ വട്ടം ചുറ്റിയ പശുവിന് അത്ഭുത ശക്തിയുള്ളതായി തെറ്റിധരിച്ച് ആരാധിച്ച് ഗ്രാമീണര്‍

ലഖ്‌നൗ: ഉത്തര്‍ പ്രദേശിലെ ശ്രാവസ്തി ജില്ലയിലെ ഒരു വയലില്‍ എട്ട് ദിവസത്തോളം...

'விஜயதாரணி, பச்சைமால், பாலகங்கா…' – தவெகவில் இணைந்த மாற்றுக் கட்சி நிர்வாகிகளின் இன்றைய லிஸ்ட்!

தேர்தல் முடிவுகளுக்குப் பிறகு, தமிழக வெற்றிக் கழகத்தில் மாற்றுக் கட்சியினர் பலர்...

RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..

దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక...

‘ಉತ್ತರಕುಮಾರನ ಪೌರುಷ’ ಸಾಕು ಮಾಡಿ: ಕಸದ ಟೆಂಡರ್‌ ಭ್ರಷ್ಟಚಾರ CBI ತನಿಖೆಗೆ ವಹಿಸಿ- ಆರ್.ಅಶೋಕ್

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,13,2026 (www.justkannada.in): ಬೆಂಗಳೂರಿನ ಕಸದ ಟೆಂಡರ್ ನಲ್ಲಿ ಆಗಿರುವ ಬ್ರಹ್ಮಾಂಡ...