27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..

Date:

శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకప్పుడు సుమారు 30 నెలల పాటు టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లు, బీసీసీఐ , జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుని కెప్టెన్సీ రేసులో ముందంజలో నిలిచారు. ఇది భారత క్రికెట్‌లో ఒక అద్భుతమైన కమ్‌బ్యాక్ నిలవనుంది. గత ఐపీఎల్ సీజన్‌లో 600కు పైగా పరుగులు, ఈ ఏడాది దాదాపు 500 పరుగులు చేసిన ఆయన బ్యాటర్‌గా తన సత్తా చాటారు. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టును అద్భుతంగా నడిపించి, ఐపీఎల్‌లో 100కు పైగా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన దిగ్గజాల జాబితాలో చేరారు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా శ్రేయస్ అయ్యర్ భవిష్యత్తులో భారత కెప్టెన్ అవుతారని గతంలోనే అంచనా వేశారు. ఇక భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో శ్రేయస్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ కాలం నుండి మంచి వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. శ్రేయస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంపై గంభీర్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవని సమాచారం. ఈ నియామకం ఖరారైతే రాబోయే టీ20 ప్రపంచ కప్, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ వీరికి కీలకమైన బాధ్యతలు కానున్నాయి.

ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఐపీఎల్, దేశీవాళీ టోర్నమెంట్లలో ఆయన ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నారు. గురువారం జరిగిన టీ20 ముంబై లీగ్‌లో కూడా ఆయన కేవలం 5 పరుగులకే అవుట్ కావడం ఆయన ఫామ్‌లేమిని సూచిస్తోంది. దీంతో శ్రేయస్ అయ్యర్ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

మరోవైపు, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి గాయం నుండి వేగంగా కోలుకుంటున్నారు. జూన్ 13 నుండి ధరమ్‌శాలలో ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ సమయానికి ఆయన పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. ఐపీఎల్ తర్వాత ఫ్రాన్స్ వెళ్లిన పాండ్యా, అక్కడి నుండి నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకుని పునరావాసంలో. జూన్ 10 వరకు అక్కడే ఉండి, ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తే జూన్ 11న ధరమ్‌శాల వెళ్లనున్నారు.

గత 15 నెలలుగా వన్డేలు ఆడని పాండ్యా తిరిగి జట్టులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యా ఎంపిక పూర్తిగా వారి ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. ఐపీఎల్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఐదు మ్యాచ్‌లకు దూరమైన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా బెంగళూరు అకాడమీకి నివేదించలేదు, కానీ సిరీస్ సమయానికి కోలుకుంటారని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, మే 31న జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో గాయపడిన విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..

Shoaib Akhtar: పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజు రోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా మాజీ...

ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಒಂದು ಇಂಚು ಭೂಮಿ ಕೊಡಬೇಡಿ- ರೈತರಿಗೆ HDK ಕಿವಿಮಾತು

ರಾಮನಗರ,ಜೂನ್,27,2026 (www.justkannada.in): ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್ ನಿರ್ಮಾಣ ವಿಚಾರ ಸಂಬಂಧ...

കരാറിലെ ഓരോ നിബന്ധനയും ഇസ്രഈലിന് അനുകൂലമെന്ന്; ബെയ്‌റൂട്ടില്‍ ഹിസ്ബുല്ല അനുകൂലികളുടെ പ്രതിഷേധം

ബെയ്‌റൂട്ട്: ഇസ്രഈലും ലെബനനും തമ്മില്‍ അമേരിക്കയുടെ മധ്യസ്ഥതയില്‍ വാഷിങ്ടണില്‍ ഒപ്പുവെച്ച കരാറിനെതിരെ...