5
June, 2026

A News 365Times Venture

5
Friday
June, 2026

A News 365Times Venture

IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!

Date:

IND W vs ENG W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత మహిళల జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించినా, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను 2-1 తేడాతో చేజార్చుకుంది. టాంటన్ వేదికగా జరిగిన మూడో, నిర్ణయాత్మక టీ20లో ఇంగ్లండ్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ మొదట బ్యాటింగ్ చేయడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన భారత జట్టు మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యతాయుతంగా ఆడుతూ అజేయంగా 56 పరుగులు చేసింది. ఆమెకు జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు చక్కటి సహకారం అందించడంతో భారత్ పోరాడే స్కోర్‌ను సాధించింది.

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కు కూడా ప్రారంభం అంతగా కలిసిరాలేదు. భారత బౌలర్లు పవర్‌ప్లే లోనే మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 38/3 స్కోర్‌కు పరిమితం చేశారు. దీంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత ఎలిస్ క్యాప్సీ, హీథర్ నైట్ అద్భుత బ్యాటింగ్‌ తో మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పారు. ఎలిస్ క్యాప్సీ కేవలం 43 బంతుల్లో 82 పరుగులు చేసి తన కెరీర్‌ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ లలో ఒకటిని నమోదు చేసింది. మరోవైపు అనుభవజ్ఞురాలు హీథర్ నైట్ 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.

ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారు. చివరకు ఇంగ్లండ్ 18.3 ఓవర్లలోనే 184/4 స్కోర్ చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఎనిమిదేళ్ల తర్వాత భారీ టీ20 ఛేజ్‌ను నమోదు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఈ సిరీస్ భారత జట్టుకు కీలకమైన పరీక్షగా భావించబడింది. అయితే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడడంతో జట్టు సన్నాహకాల్లో ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు ఉన్నాయని ఈ సిరీస్ స్పష్టంచేసింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఒత్తిడిని తట్టుకుని అద్భుతంగా పుంజుకుని సిరీస్‌ను సొంతం చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമേരിക്കൻ സൈനിക രഹസ്യങ്ങൾ ഇസ്രഈലിലേക്ക്? നിർണായക നീക്കത്തിന് പിന്നിൽ ‘നെതന്യാഹു പ്ലാൻ’; കത്ത് പുറത്ത്

ടെൽ അവീവ്: അമേരിക്കയും ഇസ്രഈലും തമ്മിലുള്ള സൈനിക ബന്ധം പുനർനിർമിക്കാനുള്ള നീക്കത്തിന്...

இந்தியா கூட்டணி: “காங்கிரஸ் பங்கேற்கும் கூட்டத்தில் திமுக பங்கேற்காது" – திமுக திட்டவட்ட அறிவிப்பு!

5 மாநில தேர்தல் முடிவுகளுக்குப் பிறகு, காங்கிரஸ் தலைமையில் 'இந்தியா' கூட்டணிக்...

Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

Story Board: తెలంగాణ ఏర్పాటై పన్నెండేళ్లు గడిచింది. ఉద్యమ ఆకాంక్షలు ఏ...

ಸಿಎಂ ಬದಲಾವಣೆ: ಹೈಕಮಾಂಡ್ ನಿರ್ಧಾರಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಒಪ್ಪಿದ್ದಾರೆ- ಕೆ.ಎನ್ ರಾಜಣ್ಣ

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,4,2026 (www.justkannada.in): ಸಿಎಂ ಬದಲಾವಣೆ ಆಗುವುದಿಲ್ಲ ಎಂಬ ನಿರೀಕ್ಷೆ ಇತ್ತು....