13
June, 2026

A News 365Times Venture

13
Saturday
June, 2026

A News 365Times Venture

Rocket Explosion: బ్లూ ఆరిజిన్‌కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!

Date:

Rocket Explosion: ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘న్యూ గ్లెన్’ రాకెట్‌కు సంబంధించిన హాట్-ఫైర్ పరీక్ష సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో బ్లూ ఆరిజిన్ ప్రయోగ కేంద్రం ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భవిష్యత్ అంతరిక్ష మిషన్‌కు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రాకెట్‌ను ప్రయోగానికి ముందు పరీక్షించే అత్యంత కీలక దశల్లో హాట్-ఫైర్ టెస్ట్ ఒకటి. ఇందులో రాకెట్‌ను నేలకే బిగించి ఉంచి ఇంజిన్లను ఆన్ చేసి పనితీరు, ఇంధన వ్యవస్థలు, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు.

ఈ ఘటనపై స్పందించిన బ్లూ ఆరిజిన్ సంస్థ, పరీక్ష సమయంలో “అసాధారణ పరిస్థితి” ఏర్పడిందని వెల్లడించింది. “నేటి హాట్-ఫైర్ పరీక్షలో ఒక అనామలీ చోటుచేసుకుంది. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే వెల్లడిస్తాం” అని కంపెనీ తెలిపింది. పేలుడు కారణంగా పరీక్ష వాహనం, పరిసర మౌలిక వసతులకు గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే నష్టం ఎంత మేర జరిగిందనే విషయంపై సంస్థ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అలాగే ఈ ప్రమాదం వల్ల భవిష్యత్ ప్రయోగాల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశం కూడా స్పష్టత రాలేదు.

ఘటన అనంతరం జెఫ్ బెజోస్ కూడా స్పందించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఘటనకు గల కారణాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. “సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. అసలు కారణం ఏమిటో ఇప్పుడే చెప్పలేం. కానీ దానిపై పరిశోధన ప్రారంభించాం. ఇది చాలా కఠినమైన రోజు. అయినప్పటికీ అవసరమైనదంతా మళ్లీ నిర్మించి తిరిగి ప్రయోగాలను కొనసాగిస్తాం” అని బెజోస్ పేర్కొన్నారు. 98 మీటర్లకు పైగా ఎత్తుతో రూపొందిస్తున్న న్యూ గ్లెన్ రాకెట్, భారీ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలను కక్ష్యలోకి పంపేందుకు రెడీ అవుతుంది. వాణిజ్య, ప్రభుత్వ అంతరిక్ష రంగాల్లో బ్లూ ఆరిజిన్ కీలక పోటీదారుగా నిలవాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే అంతరిక్ష రాకెట్ అభివృద్ధిలో పరీక్షల సమయంలో ఇలాంటి వైఫల్యాలు సహజమేనని నిపుణులు చెబుతున్నారు. గతంలో అనేక ప్రముఖ అంతరిక్ష సంస్థలు కూడా ప్రారంభ దశల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, తరువాత విజయవంతమైన ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അഭിഭാഷകന്റെ പരാതി; യൂട്യൂബര്‍ തൊപ്പിക്കും സംഘത്തിനുമെതിരെ അന്വേഷണത്തിന് ഉത്തരവിട്ട് ഡി.ജി.പി

കൊച്ചി: യൂട്യൂബര്‍ തൊപ്പി എന്ന നിഹാദിനും സംഘത്തിനുമെതിരെ താന്‍ നല്‍കിയ പരാതിയില്‍...

தர்மஸ்தலா கோயில் விவகாரம்: `இரண்டு நாள்களில் நானே நேரில் சொல்கிறேன்' – நடிகர் பிரகாஷ் ராஜ் விளக்கம்!

கர்நாடகா தட்சிண கன்னடா மாவட்டத்தில் உள்ளது தர்மஸ்தலா மஞ்சுநாத சுவாமி கோயில்....

Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి

టూర్‌కు వెళ్దాం అంటే ఆ పిల్లలు సంతోషంతో తండ్రి వెంట వెళ్లారు....

ಬಿಡದಿ ಟೌನ್​ ಶಿಪ್​​​ ಗೆ​ ಅಂತಿಮ ಅಧಿಸೂಚನೆ ಪ್ರಕಟಿಸಿದ ಸರ್ಕಾರ

ಬೆಂಗಳೂರು, ಜೂನ್, 12,2026 (www.justkannada.in): ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು  ಬಿಡದಿ ಟೌನ್...