10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..

Date:

ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు వేళ ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరిగింది. వాంఖేడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో రాజస్థాన్ 8 విజయాలు, 6 ఓటములతో మొత్తం 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అధికారికంగా నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. ముంబయి ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడమే కాకుండా.. తమతో పాటు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లను కూడా టోర్నీ నుంచి ఇంటికి తీసుకెళ్లినట్లయింది.

ఈ సీజన్ ముగింపు పాయింట్ల పట్టిక సమీకరణాలను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో 14 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచి ముందే ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. లీగ్ దశలో తమ 14 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న పంజాబ్ కింగ్స్ 7 విజయాలు, 6 ఓటములు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో (నో-రిజల్ట్) మొత్తం 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లు సాధించడంతో, పంజాబ్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ అవకాశాన్ని చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది.

లక్నోపై సెంచరీ బాది పంజాబ్‌ను రేసులో నిలిపిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (సర్పంచ్ సాబ్).. తమ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ముంబయి గెలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. లక్నో మ్యాచ్ అనంతరం ఆయన సరదాగా “రేపు ముంబయికి సపోర్ట్ చేయండి” అని పిలుపునిచ్చాడు. కానీ వాంఖేడే మ్యాచ్‌లో ముంబయి చేతులెత్తేయడంతో శ్రేయాస్ అయ్యర్ ఆశలు అడియాశలయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్, కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు. “ముంబయి నమ్మకద్రోహం చేసింది”, “సర్పంచ్ సాబ్ ఆశలపై ముంబయి నీళ్లు చల్లింది” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ముంబయి ఓటమితో పంజాబ్ కెప్టెన్ కల చెదిరిపోయిందంటూ నెట్టింట తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే 13 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశలు కూడా ఈ ఫలితంతో పూర్తిగా ముగిసిపోయాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കരയുന്ന കുട്ടികളുടെ ശബ്ദം, സഹായത്തിനായി നിലവിളിക്കുന്ന സ്ത്രീകള്‍; ലെബനനില്‍ ഇസ്രഈലി ഡ്രോണുകളുടെ പുതിയ തന്ത്രം

ബെയ്‌റൂട്ട്: വ്യോമാക്രമണങ്ങള്‍ക്കും മിസൈല്‍ വര്‍ഷങ്ങള്‍ക്കും പുറമേ, സാധാരണക്കാരെ ലക്ഷ്യമിട്ടുള്ള ക്രൂരമായ പുതിയ...

பொள்ளாச்சி பாலியல் வழக்கில் குற்றம்சாட்டப்பட்ட ‘பார்’ நாகராஜ் தவெக-வில் இணைந்தாரா?

கோவை மாவட்டம் பொள்ளாச்சியில் கடந்த 2019-ம் ஆண்டில் இளம் பெண்களை வீடியோ...

Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!

Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. నేటితో...

ದೀರ್ಘಾವಧಿ ಪ್ರಧಾನಿ: ನೆಹರು ದಾಖಲೆ ಮುರಿದು ಹೊಸ ಇತಿಹಾಸ ಬರೆದ ಪಿಎಂ ಮೋದಿ

ನವದೆಹಲಿ, ಜೂನ್ ,10,2026 (www.justkannada.in)  ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ದೇಶದ...